పొత్తులు పొత్తులే... పోరాటాలు పోరాటాలే... ప్రజల కోసమే పోరాటమే అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు అన్నారు. ప్రధాని పర్యటన పలుచగా జరిగిందని, ప్రధాని హోదా రాష్ట్రానికి ఏమివ్వలేదన్నారు.
సీపీఐ, సీపీఎం కలయిక నాంది ప్రస్తావన అని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. తెలంగాణ రాష్ట్ర CPI CPM ఉమ్మడి సమావేశం నాంపల్లి గ్రౌండ్స్ లో ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇవాళ చంద్ర రాజేశ్వర్ రావు వర్ధంతి రోజని గుర్తు చేశారు.
బీజేపీకి వ్యతిరేకంగా కమ్యూనిస్టుల తరువాత పోరాడే వ్యక్తి కేసీఆర్ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. అనేక అంశాలపై కేసీఆర్‌కు అవగాహన ఉందన్నారు.