సీపీఐ, సీపీఎం కలయిక నాంది ప్రస్తావన అని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. తెలంగాణ రాష్ట్ర CPI CPM ఉమ్మడి సమావేశం నాంపల్లి గ్రౌండ్స్ లో ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇవాళ చంద్ర రాజేశ్వర్ రావు వర్ధంతి రోజని గుర్తు చేశారు.
CPI, CPM కలిసి సమావేశం అవడం ఇది తొలిసారి హిస్టారికల్ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర CPI CPM ఉమ్మడి సమావేశం నాంపల్లి గ్రౌండ్స్ లో ప్రారంభించారు.
ఈ గడ్డ మీద కాషాయ జెండాను ఎరుగానివ్వడం కాదు, తరిమి తరిమి కొడతాం,గోల్కొండ కోట కింద బొంద పెడతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం మొత్తం మళ్ళీ ఎర్ర జెండా వైపు చూస్తున్న క్రమంలో మనం ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.
తెలంగాణలో రాజకీయ వేడి ఎక్కువగా ఉందని, ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం జరుగుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ప్రజా సమస్యల గురించి ఏ పార్టీ మాట్లాడకుండా రాజకీయాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.