సీపీఐ, సీపీఎం కలయిక నాంది ప్రస్తావన అని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. తెలంగాణ రాష్ట్ర CPI CPM ఉమ్మడి సమావేశం నాంపల్లి గ్రౌండ్స్ లో ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇవాళ చంద్ర రాజేశ్వర్ రావు వర్ధంతి రోజని గుర్తు చేశారు.
ఈ గడ్డ మీద కాషాయ జెండాను ఎరుగానివ్వడం కాదు, తరిమి తరిమి కొడతాం,గోల్కొండ కోట కింద బొంద పెడతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం మొత్తం మళ్ళీ ఎర్ర జెండా వైపు చూస్తున్న క్రమంలో మనం ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.
హన్మకొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. హన్మకొండ , వరంగల్ జిల్లాలలో జరుగుతున్న భూ పోరాటాల కేంద్రాలను సందర్శించేందుకు వెళ్తున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ పోతినేని సుదర్శన్ లను వరంగల్ జిల్లా రాయపర్తిలో పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం ఉదయం కలెక్టరేట్ వద్ద సీపీఎం(CPM) ఆధ్వర్యంలో మహాధర్నాకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో సీపీఎం కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. మహిళలు ఎర్రటిఎండలో రోడ్డుపై బైఠాయించారు. కాగా…
ప్రసాదరావు అభినందన సభకు రాని కృష్ణదాస్, తమ్మినేని..! శ్రీకాకుళం జిల్లా వైసీపీలో అంతర్గత విభేదాలు మొదటి నుంచీ ఉన్నాయ్. ధర్మాన సోదరుల మధ్యే సఖ్యత లేదు. తాజా మంత్రివర్గ విస్తరణతో నేతల మధ్య ఆ అంతరం ఇంకా పెరిగిందట. మంత్రిగా ప్రమాణం చేసి జిల్లాకు వచ్చిన ధర్మాన ప్రసాదరావు అభినందన సభకు అందరినీ రావాలని ఆహ్వానించారు. ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల నేతలకు ధర్మాన కీలక అనుచరులు ఫోన్లు చేశారు. అయితే ఆ సమావేశానికి నరసన్నపేట.. ఆమదాలవలస…
ఆ జిల్లాలోని అధికార వైసీపీలో గ్రూపుల గోల పెరిగిపోతోంది. ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గానికి అసంతృప్తి గళాలు విస్తరిస్తున్నాయి. ఇప్పటికే ఆ జిల్లాలో 3 నియోజకవర్గాల్లో తారాస్థాయిలో విభేదాలు ఉన్నాయి. అధినాయకత్వంపై విధేయత ప్రకటిస్తూనే.. ఎమ్మెల్యేలపై మండిపడుతున్నారు అసమ్మతి వాదులు. ఎచ్చెర్లలో ఎమ్మెల్యే కిరణ్‌పై కేడర్ రుసరుసలుశ్రీకాకుళం జిల్లా వైసీపీలో అంతర్గత కలహాలు భగ్గుమంటున్నాయి. రహస్య సమావేశాలు కాస్త బహిరంగ మీటింగ్స్‌గా మారుతున్నాయి. ఎమ్మెల్యేలతోపాటు, నియెజకవర్గ ఇంఛార్జ్‌లపై అసమ్మతి రాగం వినిపిస్తోంది కేడర్. పార్టీ కోసం…
ఒకప్పుడు చంద్రబాబు అంటే ఎంతో అభిమానం.. కానీ ఆ తర్వాత ఆ అభిమానం చెదిరిపోయింది. వైసీపీలో చేరిన ఆ నేత కీలక పదవిని పొందారు. ఇప్పుడు చంద్రబాబుపై అవకాశం వచ్చినప్పుడల్లా విమర్శలతో దాడి చేస్తున్నారు. ఆయనే ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం. తాజాగా ఆయన చంద్రబాబుని చెడుగుడు ఆడేశారు. చంద్రబాబు ప్రజల విశ్వాసం కొల్పోయారని స్పీకర్ తమ్మినేని సీతారాం విమర్శించారు. మరో రెండు మూడు పర్యాయాలు జగనే ముఖ్యమంత్రి ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. ఇచ్చిన…
పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. 70 శాతం వరకు పన్నుల రూపంలో దోచుకుంటున్నారు అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కోవిడ్ విజృంభిస్తున్న సమయంలో కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది.కేంద్ర ప్రభుత్వ ముందు చూపు లేకపోవడంవల్లనే కరోనాను అరికట్టడంలో విఫలమయ్యారు. పీఎం కేర్ పేరుతో వేల కోట్లు వసూలు చేస్తున్నారు అని తెలిపారు. ముందుచూపు లేకపోవడం వల్లనే వ్యాక్సిన్ అందరికి వేయలేక పోయారు. సొంతంగా భారత దేశంలో వ్యాక్సిన్ తయారు అవుతున్నా. ఇక్కడి…