Nagarkurnool: రూ.21.47 కోట్ల కరెంట్ బిల్లు.. ఆ.. అవాక్కయ్యారా..
- నాగర్ కర్నూల్ జిల్లా ఖానాపూర్ లో విద్యుత్ అధికారుల తప్పిదం
- ఓ ఇంటికి ఏకంగా 21 కోట్ల 47 లక్షల బిల్లు వేసిన విద్యుత్ సిబ్బంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagarkurnool: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించనుంది. ఈ పథకం గత నాలుగు నెలలుగా అమలవుతోంది. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వడంతో పేదల ఇళ్లల్లో వెలుగులు విరజిమ్ముతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కరెంట్ బిల్లు వందలు, లక్షలు కాదు కోట్లలో వచ్చింది. దీంతో ఇంటి యజమానికి గుండె ఆగివనంత పనైంది. ఈ వింత ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి ఖానాపూర్ మండలంలో చోటుచేసుకుంది.
Read also: Telangana Ministers: నేడు ఖమ్మంకు నలుగురు మంత్రులు.. సీతారామ ప్రాజెక్టు పర్యవేక్షణ..
Also Read
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం ఖానాపూర్ కు చెందిన వేమారెడ్డికి ప్రతినెలా వందల రూపాయల బిల్లు వచ్చేది. ఈ క్రమంలో ఈ నెల 7న విద్యుత్ అధికారులు వేమారెడ్డి ఇంట్లో కరెంట్ మీటర్ ను స్కాన్ చేసి రూ.21,47,48,569 చెల్లించాలని బిల్లు ఇచ్చారు. బిల్లు ఆలస్యంగా చూసిన వేమారెడ్డికి షాక్ తగిలింది. సాధారణంగా వందరూపాయల్లో రావాల్సిన బిల్లు రూ.కోట్లలో వస్తోందని ఆందోళన చెందడంతో విద్యుత్ శాఖ అధికారులను ఆశ్రయించాడు. దీనిపై ఏఈ మహేశ్ ను వివరణ కోరగా జీరో బిల్లింగ్ సమయంలో ఇలా జరిగిందని తెలిపారు.
Read also: Tragedy: విషాదం.. కాలకృత్యాలకు వెళ్లిన అక్కాచెల్లెళ్లను పలకరించిన అకాలమృత్యువు
లైన్‌మెన్, జూనియర్ లైన్‌మెన్‌లు అవగాహన లేని బయటి వ్యక్తులతో కరెంటు బిల్లులు ఇస్తున్నట్లు సమాచారం. విద్యుత్ శాఖకు సంబంధించిన ప్రతి పనిని ప్రైవేట్ వ్యక్తులే చేయడంతో వారికి అవగాహన లేకపోవడంతో కరెంట్ బిల్లు తడిసి మోపెడవుతోంది. దీనిపై ఏఈ మహేశ్‌ను వివరణ కోరగా.. సాంకేతిక లోపంతో బిల్లులు ఎక్కువగా వచ్చిన మాట వాస్తవమేనన్నారు. కొనుగోలు ఫిర్యాదు మేరకు వెంటనే బిల్లులు సరిచేశామని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం గ్రామజ్యోతి పథకం కింద జీరో బిల్లును అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో 200 యూనిట్లలోపు కరెంట్ వాడితే జీరో బిల్లు నడుస్తోంది. అయితే అందుకు భిన్నంగా లక్షలు, కోట్ల రూపాయల్లో బిల్లులు రావడంతో కొందరు అయోమయానికి గురవుతున్నారు. సాంకేతిక కారణాల వల్ల అక్కడక్కడా ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నాయి.
Crime News: మదనపల్లెలో దారుణం.. తండ్రిని హత్య చేసిన కూతురు!
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!