Tammineni: సీపీఎం జాబితా విడుదల.. పాలేరు నుంచి తమ్మినేని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tammineni: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను సీపీఎం ఆదివారం విడుదల చేసింది. సీపీఎం తొలి జాబితాలో 14 మందికి చోటు దక్కింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఇవాళ ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో తమ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేసే జిల్లాల్లో ఎన్నికల ఏర్పాట్లలోకి వెళ్లాలని పార్టీ సమావేశంలో నిర్ణయించినట్లు తమ్మినేని వీరభద్రం తెలిపారు. మిగిలిన మూడు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల జాబితాను త్వరలో విడుదల చేస్తామని తమ్మినేని వీరభద్రం తెలిపారు. అసెంబ్లీలో సీపీఎం ప్రాతినిధ్యం కల్పించండి.. తమ పార్టీకి ప్రాతినిధ్యం కల్పిస్తేనే పేద ప్రజల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తామని తమ్మినేని వీరభద్రం అన్నారు.
చట్టసభల్లో కమ్యూనిస్టులు బలంగా ఉన్నప్పుడు ఉపాధి హామీ చట్టం, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేశారని తమ్మినేని వీరభద్రం గుర్తు చేశారు. ఈ విషయాలను తెలంగాణ ప్రజలు గుర్తుంచుకోవాలని కోరారు. సీపీఎంతో పాటు వామపక్ష శక్తులను బలోపేతం చేయాలని తమ్మినేని వీరభరం ప్రజలను కోరారు. సీపీఎం బలపరిచిన శక్తులకు సంఘీభావం తెలపాలన్నారు. బీజేపీని నెట్టివేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్నారు. బీజేపీ గెలిచే స్థానాల్లో బీజేపీని ఏ పార్టీ ఓడించినా తమ పార్టీ మద్దతు ఉంటుందని తమ్మినేని వీరభద్రం తెలిపారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను కూడా విడుదల చేశారు. ఈ నెల రెండో తేదీన ఒంటరి పోరాటం చేస్తామని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. 17 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తానని చెప్పారు.
Also Read
- Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
- TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
- Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
ఇదీ సీపీఎం అభ్యర్థుల జాబితా..
1. పటాన్చెరు- మల్లికార్జున్
2.ముషీరాబాద్-దశరథ్
3. భద్రాచలం- కారం పుల్లయ్య
4. అశ్వారావుపేట-పి. అర్జున్
5. పాలేరు-తమ్మినేని వీరభద్రం
6. మధిర-పాలడుగు భాస్కర్
7. వైర-భుక్య వీరభద్రం
8. ఖమ్మం-శ్రీకాంత్
9. సత్తుపల్లి-భారతీయుడు
10. మిర్యాలగూడ-జూలకంటి రంగారెడ్డి
11.నకిరేకల్-చినవెంకులు
12. భువనగిరి-నర్సింహ
13. జనగామ-కనకారెడ్డి
14. ఇబ్రహీంపట్నం-పగడాల యాదయ్య
మరోవైపు చర్చల అనంతరం కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు కుదిరినట్లు తెలుస్తోంది. కొత్తగూడెం అసెంబ్లీ స్థానాన్ని సీపీఐకి కేటాయించేందుకు కాంగ్రెస్ నేతలు అంగీకరించారు. దీంతో పాటు ఎమ్మెల్సీ సీటు కూడా ఇచ్చేందుకు పొత్తు కుదిరింది. అలాగే ఖమ్మం జిల్లాలో సీపీఎంకు సీటు ఇవ్వాలని ఈ సందర్భంగా సీపీఐ నేతలు కోరారు. అయితే ఈ అంశంపై సీపీఎం కేంద్ర కమిటీతో ఏఐసీసీ జాతీయ కమిటీ నాయకత్వం మాట్లాడుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పినట్లు సమాచారం.
కొత్తగూడెం సీటును సీపీఐకి, మరో ఎమ్మెల్సీ స్థానాన్ని కాంగ్రెస్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా గతంలోనూ స్నేహపూర్వక పోటీ ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే మునుగోడులో పోటీ చేయొద్దని సీపీఐ నేతలకు రేవంత్ రెడ్డి సూచించారని, పార్టీలో చర్చించి మరోసారి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. ఈ సమావేశంలో సీపీఎంతో పొత్తుపై సీపీఐ నేతలు ప్రస్తావించారని, దీనిపై కాంగ్రెస్ అధిష్టానం చర్చిస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు.
Mahesh Babu with Venkatesh: పెద్దోడు-చిన్నోడు భలే కలిసిపోయి ‘ముక్క’ వేశారే!
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!