Realtors Murder Case: స్కెచ్ వేసింది ఆయనే.. ఇలా జరిగింది-సీపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ శివారులోని కర్ణంగూడలో జరిగిన రియల్టర్ల హత్య కేసులో మిస్టరీ వీడింది. ఇద్దరు రియలెస్టేట్ వ్యాపారులపై కాల్పుల కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రెండు తుపాకులు, 10 తూటాలు, రెండు కత్తులు స్వాధీనం చేసుకున్నారు. రియల్ ఎస్టేట్ వివాదాలతోనే శ్రీనివాసరెడ్డి, రాఘవేంద్రరెడ్డిపై ప్రత్యర్థులు కాల్పులు జరపగా… ఇద్దరు మృతి చెందారు. కాల్పుల్లో ఇద్దరు చనిపోవడంతో ప్రత్యేక కేసుగా విచారణ జరిపిన పోలీసులు… మిస్టరీని ఛేదించారు. 48 గంటల పాటు దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నారు. నిందితులు మత్తారెడ్డి, అశోక్‌రెడ్డి, ముజాహిద్దీన్, భిక్షపతి, షమీం, రహీమ్‌ను అరెస్టు చేశారు. సాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించామన్నారు సీపీ మహేష్ భగవత్.
హత్యలకు మొత్తం స్కెచ్ వేసింది మట్టారెడ్డే అని తేలింది. మట్టారెడ్డికి గతంలో నేర చరిత్ర కూడా ఉంది. బిహార్ నుంచి తుపాకులు, మందు గుండు సామగ్రి కొన్నారు. రియలెస్టేట్ వ్యాపారులపై భిక్షపతి, మొహినుద్దీన్ కాల్పులు జరిపారు. ప్రాథమిక విచారణలో మట్టారెడ్డి తమకు సహకరించలేదన్నారు సీపీ. అతని గెస్ట్ హౌస్ దగ్గర సీసీ ఫుటేజీ దొరకడంతో కేసులో కీలక ఆధారం లభించిందని సీపీ మహేశ్ భగవత్ చెప్పారు. ఇక, ఈ సందర్భంగా సీపీ మహష్ భగవత్ ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి…
Also Read
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?