హైదరాబాద్ శివారులోని కర్ణంగూడలో జరిగిన రియల్టర్ల హత్య కేసులో మిస్టరీ వీడింది. ఇద్దరు రియలెస్టేట్ వ్యాపారులపై కాల్పుల కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రెండు తుపాకులు, 10 తూటాలు, రెండు కత్తులు స్వాధీనం చేసుకున్నారు. రియల్ ఎస్టేట్ వివాదాలతోనే శ్రీనివాసరెడ్డి, రాఘవేంద్రరెడ్డిపై ప్రత్యర్థులు కాల్పులు జరపగా… ఇద్దరు మృతి చెందారు. కాల్పుల్లో ఇద్దరు చనిపోవడంతో ప్రత్యేక కేసుగా విచారణ జరిపిన పోలీసులు… మిస్టరీని ఛేదించారు. 48 గంటల పాటు దర్యాప్తు చేసి…