Komati Reddy: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు గురువారం సోదాలు నిర్వహిస్తున్నారు. గిరిధర్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు.
విశాఖపట్నంలో సంచలనం సృష్టించిన రియల్టర్ శ్రీనివాస్ కిడ్నాప్ ను పోలీసులు చేధించారు. అయితే ఈ వ్యవహారంపై నగర సీపీ త్రివిక్రమ్ వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో బాధితులు, నిందితులు పరిచయస్తులేనని ఆయన తెలిపారు. వీరికి విజయవాడలో పరిచయాలు ఉన్నాయని.. వీరు 2019లో విజయవాడలో ఎంకే కన్‌స్ట్రక్షన్స్ పేరిట వ్యాపారం నడిపారని త్రివిక్రమ్ వర్మ చెప్పారు.
పెళ్లి అయినా.. మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.. తీరా పెళ్లి మాట ఎత్తగానే తన అసలు రూపాన్ని బయటపెట్టాడు.. నీ ఏకాంత వీడియోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బ్లాక్‌మెయిల్‌కు దిగాడు.. ఆ తర్వాత కొన్ని రోజులకే కనిపించకుండా పోయాడు.. అదృశ్యమైన రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రభు భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి… పోలీసుల దర్యాప్తులో అందరూ నివ్వెరపోయి విషయాలు బయటకు వచ్చాయి.. Read Also: Wipro: ఆ పని చేస్తున్న…
హైదరాబాదాలో కాల్పుల కలకలం రేపింది. ఈ కాల్పుల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి మృతి చెందగా.. మరొకరు తీవ్ర గాయాలపాలయ్యాయి.. ఈ ఘటన నగరంలోని మాధాపూర్ పోలీస్టేషన్ పరిధిలోని నీరూప్ వద్ద సోమవారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇస్మాయిల్ అనే వ్యక్తిని సోమవారం తెల్లవారు మూడు గంటల సమయంలో ముజీబ్ అనే వ్యక్తి తుపాకీతో కాల్చి చంపాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక సమాచారంతో పోలీసులు చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించి బుల్లెట్…
హైదరాబాద్ శివారులోని కర్ణంగూడలో జరిగిన రియల్టర్ల హత్య కేసులో మిస్టరీ వీడింది. ఇద్దరు రియలెస్టేట్ వ్యాపారులపై కాల్పుల కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రెండు తుపాకులు, 10 తూటాలు, రెండు కత్తులు స్వాధీనం చేసుకున్నారు. రియల్ ఎస్టేట్ వివాదాలతోనే శ్రీనివాసరెడ్డి, రాఘవేంద్రరెడ్డిపై ప్రత్యర్థులు కాల్పులు జరపగా… ఇద్దరు మృతి చెందారు. కాల్పుల్లో ఇద్దరు చనిపోవడంతో ప్రత్యేక కేసుగా విచారణ జరిపిన పోలీసులు… మిస్టరీని ఛేదించారు. 48 గంటల పాటు దర్యాప్తు చేసి…
హైదరాబాద్ శివారులోని ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధి కర్ణంగూడ దగ్గర జరిగిన కాల్పులు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి అక్కడికక్కడే మృతిచెందగా.. మరో రియల్టర్ ఆస్పత్రిలో రాఘవేందర్ రెడ్డి చికిత్స అందుకుంటూ మరణించాడు. ఈ కాల్పుల కేసులో మరో ట్విస్ట్ బయటపడింది. శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిలపై గతం లో పలు మార్లు రాచకొండ పోలీసులకు ఫిర్యాదులు చేశారు. తమ భూమిని కబ్జా చేస్తున్నారని రాచకొండ పోలిసులను కలిశారు లేక్…
హైదరాబాద్ శివారులోని ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధి కర్ణంగూడ దగ్గర కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి… ఈ ఘటనలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి అక్కడికక్కడే మృతిచెందగా.. మరో రియల్టర్ పరిస్థితి విషమంగా ఉంది… ఈ ఘటనకు భూ వివాదమే కారణంగా చెబుతున్నారు.. ఇటీవలే 10 ఎకరాల భూమిని ఇంద్రారెడ్డి అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేశారు శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి అనే ఇద్దరు రియల్టర్లు.. అయితే, అప్పటికే ఆ భూమిపై కబ్జాలో ఉన్నాడు మట్టారెడ్డి అనే వ్యక్తి..…
రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్ణంగూడలో కాల్పుల కలకలం సృష్టిస్తున్నాయి.. కర్ణంగూడ గ్రామ సమీపంలో ఓ రియాల్టర్ గాయాలపాలయ్యాడరు.. తనపై ఎవరో తుపాకీతో కాల్పులు జరిపారని స్థానికులకు తెలిపాడు రియాల్టర్.. ఇక, స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. బాధితుడిని ఆస్పత్రికి తరలించారు.. ఘటనా స్థలంలో ఉన్న స్కార్పియోకు రక్తం మరకలు గుర్తించారు.. అయితే, దీనిపై భిన్నకథనాలున్నాయి.. కర్ణంగూడ గ్రామ సమీపంలో స్కార్పియో కారు అదుపుతప్పినట్టుగా కూడా చెబతున్నారు.. ఒకరికి తీవ్రగాయాలు…
సంగారెడ్డి జిల్లా వెలిమెలకు చెందిన రియల్టర్ హత్య కేసుని చేధించారు పోలీసులు. తెల్లాపూర్ లో రియల్టర్ దారుణహత్యకు గురవడం కలకలం రేపింది. కనిపించకుండా పోయిన రియల్టర్ కడవత్ రాజు చివరకు హత్యకు గురయ్యాడు. హత్యకేసులో మృతుని సోదరుడు రాంసింగ్ నాయక్‌తో పాటు ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు పటాన్ చెరు డీఎస్ పి భీంరెడ్డి.. వెలిమెల కడవత్ రాజు నాయక్ ను హత్య చేసి ఒక చోట తల, మరో చోట…
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో నేరాలు ఘోరాలకు అంతే లేకుండా పోతోంది. తాజాగా శేరిలింగంపల్లి సమీపంలోని తెల్లాపూర్ లో దారుణం జరిగింది. తెల్లాపూర్ లో రియల్టర్ దారుణహత్యకు గురవడం కలకలం రేపుతోంది. నిన్నటి నుంచి కనపడకుండా పోయిన కడవత్ రాజు చివరకు హత్యకు గురయ్యాడు. రియల్ ఎస్టేట్ లావాదేవీల కారణంగానే కిడ్నాప్ చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాత ఘర్షణల కారణంగానే హత్య జరిగి ఉండవచ్చని భావిస్తున్న పోలీసులు కడవత్ రాజు బంధువుల్ని…