బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పై మరో కేసు నమోదైంది. ఆయనపై బంజారాహిల్స్ పీఎస్‌లో కేసు నమోదు చేశారు. పోలీసుల ఆదేశాలు పాటించకుండా ర్యాలీ చేశారని అభియోగం మోపారు. అయితే నిన్న (గురువారం) ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్.. బయటికొచ్చిన తర్వాత ర్యాలీతో తెలంగాణ భవన్ కు వచ్చారు. అయితే అనధికారికంగా ర్యాలీ నిర్వహించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.
అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన ప్రముఖ సంగీత విద్వాంసుడు కాన్ వాయ్ సన్‌పై ఆ రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్ర రాజధాని ఇటానగర్‌లో తన కచేరీలో.. అతడు వేదికపై బహిరంగంగా కోడిని కత్తితో చంపేసి ఆపై దాని రక్తాన్ని పిండుకుని తాగాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో వారు కేసు నమోదు చేశారు.
కొత్త ప్రభాకర్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స అందిస్తున్నారు. హత్యయత్నం చేసిన గడ్డం రాజుపై కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించడం జరిగిందని పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత తెలిపారు.
సుమారు 3 నెలలుగా మణిపూర్‌లో జాతుల మధ్య హింస కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి తరువాత అత్యాచారం చేసి.. హత్య చేసిన వీడియో బయటికి వచ్చింది.
భూకంపాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఎప్పుడు భూకంపం సంభవిస్తుందో తెలియక తీవ్ర ఆందోళనలో ఉన్నారు. గత కొన్ని రోజులుగా అఫ్ఘనిస్తాన్ లో ప్రజలు భూకంపాలతో ఇబ్బందులు పడుతున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధిలో అవినీతి చోటు చేసుకుంది సీఎంఆర్‌ఎఫ్‌లో జరిగిన అవినీతిపై సీఐడీ కేసు నమోదు చేసింది. సీఎం రిలీఫ్ ఫండ్ స్కాంపై సిఐడి దర్యాప్తులో విస్తుపోయే అంశాలు బయటికి వస్తున్నాయి.