Pawan Kalyan: కథ నచ్చకపోతే కాల్చేస్తారా?.. పవన్ కల్యాణ్‌ను అడిగిన డైరెక్టర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan Fires on Tholi Prema Director Karunakaran: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్‌లోని సూపర్ హిట్ చిత్రాల్లో ‘తొలిప్రేమ’ ఒకటి. కీర్తి రెడ్డి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను ప్రేమకథా చిత్రాలకు అడ్రస్ అయిన కరుణాకరన్ దర్శకత్వం వహించారు. క్లాసిక్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా పవన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. కరుణాకరన్ టేకింగ్, పవన్ నటన, కీర్తి అందం ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమా అపట్లో క్రియేట్ చేసిన రికార్డ్స్ అన్నిఇన్ని కావు. ఇక దేవ అందించిన పాటలు ఇప్పటికీ కూడా మార్మోగుతున్నాయి. ఈ సినిమా విడుదలై 25 ఏళ్లు పూర్తి కావొస్తుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం 4కె వెర్షన్‌లో ‘తొలిప్రేమ’ను శుక్రవారం రీ రిలీజ్ చేసింది.
తొలిప్రేమ సినిమాకు రీ రిలీజ్‌లో కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయని సినీ వర్గాలు పేర్కొన్నాయి. రీ రిలీజ్ నేపథ్యంలో దర్శకుడు కరుణాకరన్ అప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు. సినిమా షూటింగ్‌కు సంబంధించిన విషయాలను ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి దాదాపు 7 నెలల సమయం పట్టింది. ఓ రోజు రాత్రి 7 గంటలకు ఆయన నాకు అపాయింట్ మెంట్ ఇచ్చారు. అయితే కారు టైర్ పంచర్ అవ్వడంతో నేను 8.30కు వెళ్లాల్సి వచ్చింది. దాంతో పవన్ చాలా కోపంగా ఉన్నారు. అప్పుడు చేతిలో గన్ పట్టుకొని ఉన్నారు. కథ నచ్చకపోతే కాల్చేస్తారా? ఏంటి అని అడిగా. వెంటనే ఓ నవ్వు నవ్వేసి కూల్ అయిపోయారు’ అని కరుణాకరన్ చెప్పారు.
Also Read
- Toxic OTT Deal: రూ.30 కోట్లే.. 'టాక్సిక్' మరీ ఇంత దారుణమా?
- Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
- Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
‘తొలిప్రేమ సినిమాలోని ‘ఈ మనసే’ పాట ఎడిటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ రామానాయుడు స్టూడియోకి వచ్చారు. పాట చివరి దశలో ఉంది కాస్త వెయిట్ చేయండని చెప్పి నేను లోపలి వెళ్లాను. అయితే ఎడిటింగ్ అయ్యేసరికి చాలా సమయం పట్టింది. అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు అక్కడే ఉన్నారు అది చూసి నేను షాక్ అయ్యాను. దాదాపు 6 గంటలు వెయిట్ చేశారు. అది ఆయన గొప్పతనం. ఆ తర్వాత పాట విని సంతోషించారు’ అని ఆ నాటి జ్ఞాపకాలను కరుణాకరన్ గుర్తుచేసుకున్నారు.
Also Read: Minister KTR: మరో రెండేళ్లలో ఎయిర్‌పోర్టుకు మెట్రో రైలు: కేటీఆర్
Also Read: Bro Teaser: పూజా లేకుండా సినిమాలు తీయరా?.. త్రివిక్రమ్‌ను ఆడుకుంటున్న నెటిజన్లు!
తాజావార్తలు
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
-
Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
-
MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
-
Toxic OTT Deal: రూ.30 కోట్లే.. ‘టాక్సిక్’ మరీ ఇంత దారుణమా?
-
Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!