Balakrishna : నందమూరి బాలకృష్ణ మరోసారి గొప్ప మనసు చాటుకున్నాడు. తెలంగాణలో వరదలు నిండా ముంచేశాయి. అందులోనూ కామారెడ్డి, మెదక్, నిర్మల్ జిల్లాలను అతలాకుతలం చేసేశాయి. కామారెడ్డిలో భారీ విధ్వంసమే జరిగింది. దాంతో టాలీవుడ్ నుంచి ఒక్కొక్కరుగా సాయం ప్రకటిస్తున్నారు. తాజాగా నందమూరి నటసింహం బాలకృష్ణ మంచి మనసు చాటుకున్నాడు. వరదల వల్ల నష్టపోయిన వారి కోసం తెలంగాణ సీఎం సహాయ నిధికి రూ.50 లక్షలు సాయం అందిస్తున్నట్టు ప్రకటించారు. తాజాగా ఆయన వరల్డ్ బుక్ ఆఫ్…
Telangana Floods : డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మంచి మనసు చాటుకున్నాడు. తెలంగాణలో వరదలు భారీగా నష్టం చేశాయి. కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో విధ్వంసం జరిగింది. ఇలాంటి సమయంలో టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ముందుకొచ్చారు. తన భద్రకాళి ప్రొడక్షన్స్ తరఫున సీఎం సహాయనిధికి రూ. 10 లక్షల విరాళాన్ని అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సందీప్ రెడ్డి వంగా, ప్రణయ్ రెడ్డి వంగా ఈ రోజు చెక్ ను అందించారు. ఇక్కడి…
అదిగో పులి అంటే ఇదిగో తోక అన్న చందాన, నిన్న మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఒక వార్తను ఎవరో ఒకరు తప్పుగా రాయడం మొదలుపెట్టడంతో, సోషల్ మీడియా అంతా అదే హడావుడితో నిండిపోయింది. అసలు విషయం ఏమిటంటే, ముఖ్యమంత్రి సహాయనిధికి మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయలు విరాళం ఇచ్చారని చెబుతూ, ఒక సోషల్ మీడియా అకౌంట్ నుంచి తొలుత ఒక ట్వీట్ పడింది. వెంటనే దాన్ని బేస్ చేసుకుని, సోషల్ మీడియాలో వేరే అకౌంట్ల నుంచి ట్వీట్లు…
CM Chandrababu: పార్టీ కేంద్ర కార్యాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా పలువురికి ఆర్థిక సాయం నిధులు చేశారు. అనంతరం నేతలతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ సంస్థాగత వ్యవహారాలపై చర్చించారు. అనంతరం మీడియాతో ముఖ్యమంత్రి చంద్రబాబు చిట్‌చాట్ నిర్వహించారు. రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలపై పూర్తి అప్రమత్తతో ఉన్నామన్నారు.
Tummala Nageswara Rao : ఖమ్మం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య వ్యాఖ్యలు చేశారు. గత సంవత్సన్నర కాలంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధికి పలు కీలక కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ, రాహుల్ గాంధీ దేశ రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభించారని, 4,400 కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా ప్రజల్లో నమ్మకాన్ని కలిగించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకు న్యాయం…
ఉగాది పండగ రోజున పేదలకు సాయంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రూ.38 కోట్ల సీఎం సహాయ నిధి ఫైలుపై సంతకం చేశారు. దాంతో 3,456 మంది లబ్ధిదారులకు మేలు జరగనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.281 కోట్లు విడుదల చేసింది. వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పేద కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం సహాయ నిధి ఉపయోగపడుతుంది. Also Read: Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు…
మహారాష్ట్ర కొత్త ప్రభుత్వం గురువారం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణస్వీకారం చేశారు. ఫడ్నవిస్‌తో పాటు డిప్యూటీ సీఎంలుగా అజిత్ పవార్, ఏక్‌నాథ్ షిండే ప్రమాణం చేశారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణస్వీకారం చేశారు. ముచ్చటగా మూడోసారి గురువారం సీఎంగా ప్రమాణం చేశారు. ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం ఒక పేషెంట్‌కు ఆర్థిక సాయంపై చేశారు.
ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటం... అత్యవసర వైద్య చికిత్స అవసరమైతే సాయం అందించటంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త రికార్డు నెలకొల్పారు. అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే దాదాపు రూ.830 కోట్లు సీఎంఆర్ఎఫ్ విడుదల చేశారు. రాష్ట్రంలోని 1,66,000 పేద, మధ్యతరగతి కుటుంబాలు సీఎంఆర్ఎఫ్‌తో లబ్ధి పొందాయి.
వరద బాధితులకు సహాయం కోసం పలువురు దాతలు విరాళాలు అందించి దాతృత్వం చాటుకుంటున్నారు. సచివాలయంలో బుధవారం సీఎం చంద్రబాబు నాయుడుని కలిసి దాతలు చెక్కులు అందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన పిలుపుతో పలువురు దాతలు, ప్రముఖులు, పారిశ్రామిక, వ్యాపార, విద్యా, వాణిజ్య సంస్థలకు చెందిన వారు తమ వంతు సాయంగా విరాళంగా అందించారు.