కరోనా పరిస్థితుల నేపథ్యంలో.. ఇప్పుడు సమావేశాలు అన్నీ జూమ్‌కు పరిమితం అయ్యాయి.. ఇక, ఇవాళ డీసీసీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో జూమ్ లో సమావేశం నిర్వహించారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ వస్తున్న కాంగ్రెస్.. దీనిపై రేపు గవర్నర్ తమిళిసై ను కలిసి.. వినతి పత్రం సమర్పించాలని నిర్ణయించారు.. జిల్లా కేంద్రాలలో డీసీసీ అధ్యక్షుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రతినిధి బృందం కలెక్టర్లను కలిసి వినతిపత్రం ఇవ్వాలని సూచించారు.. మరోవైపు 7వ తేదీన హైదరాబాద్ గాంధీ భవన్‌తో పాటు జిల్లా కేంద్రాలల్లోనూ దీక్షలు చేయాలని పీసీసీ నిర్ణయించింది. రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్, కరోనాకు ప్రభుత్వం ఉచితంగా వైద్యం అందించాలని కోరిన పీసీసీ.. అలాగే హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన విధంగా ప్రైవేటు ఆస్పత్రులు వసూలు చేసిన అధిక ఫీజులను తిరిగి బాధితులకు అందజేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.