‘మా’ కాంట్రవర్సీ : బాలయ్య కామెంట్స్ పై నాగబాబు స్పందన

“మా” కాంట్రవర్సీ రోజురోజుకూ ముదురుతోంది. ఈసారి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలలో 5 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయ్యారు. అయితే ఈ విషయానికి సంబంధించి అభ్యర్థులు ఒకరిపై ఒకరు చేసుకున్న కామెంట్స్, స్టార్ హీరోలు ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనే విషయాలు చర్చనీయాంశంగా మారాయి. నిన్న ‘మా’ ఎలక్షన్స్ పై మొదటిసారిగా స్పందించిన నందమూరి బాలకృష్ణ ఇండస్ట్రీ సమస్యలను బహిరంగంగా చర్చించడం సరికాదని హితవు పలికారు. అలాగే లోకల్, నాన్ లోకల్ గురించి పట్టించుకోనని అన్నారు. ‘మా’కు ఇంతవరకూ ఎందుకు శాశ్వత భవనాన్ని నిర్మించలేకపోయారని ప్రశ్నించిన బాలయ్య తెలంగాణ సర్కార్ తో రాసుకుపూసుకు తిరుగుతున్నారు. మా బిల్డింగ్ కోసం ఒక్క ఎకరం భూమిని కూడా ఇవ్వరా ? గతంలో ‘మా’ ఫండ్ రైజింగ్ అంటూ విమానాల్లో ఫస్ట్ క్లాస్ టికెట్లు వేసుకుని తిరిగారు. ఆ డబ్బులు ఏం చేశారు ? అని నిలదీశారు. ‘మా’ కోసం శాశ్వత భవనాన్ని నిర్మిస్తానన్న మంచు విష్ణుకు తాను సపోర్ట్ చేస్తున్నాను అని ప్రకటించారు.

Read Also : ‘మా’ఎన్నికలు: బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

బాలయ్య ఈ వ్యాఖ్యలు చేసిన అనంతరం మెగా బ్రదర్ నాగబాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. “ఏకగ్రీవ ఎన్నికలు అనేది మంచి విషయం కాదు. ఏ అసోసియేషన్ అయినా ఎన్నికలు ఉండాలి. పోటీదారుల మధ్య ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి. మాజీ ‘మా’ ప్రెసిడెంట్ మురళీమోహన్ ‘మా’ భవనం కోసం పోరాడి ఉంటే మాకు చాలా కాలం క్రితమే భవనం ఏర్పాటు అయ్యేది. కానీ ముందుగా వాళ్లంతా ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేశారు. కానీ ఇప్పుడు దానికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. వాళ్ళ తరువాత ‘మా’ భవనం కోసం చాలా ప్రయత్నాలు జరిగాయి. శివాజీరాజా ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు దాని కోసమే ఫండ్ రైజింగ్ కూడా జరిగింది. నరేష్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అదేమీ జరగలేదు” అని అన్నారు. ఇక ప్రకాష్ రాజ్ కు సపోర్ట్ చేసే విషయంలో ఆయనకు పక్కా విజన్, అన్ని విషయాలపై క్లారిటీ ఉంది కాబట్టి మద్దతు ఇస్తున్నాము. మరి మంచు విష్ణు ‘మా’ భవనాన్ని తానే నిర్మిస్తా అని చెప్తున్నారు సరే మరి స్థలం గురించి ఆయనకు అసలు క్లారిటీ ఉందా ?” అని ప్రశ్నించారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-