Jeevan Reddy: బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు దొంగలే అని ఎం.ఎల్.సి. జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి హామీతో రైతులకు, కూలీలకు రక్షణ కల్పిస్తే.. మోడీ ప్రభుత్వం ఆదానీ, అంబానీలకు 12ల క్షల కోట్లు మాఫీ చేసిందని మండిపడ్డారు. దేశంలో బడా వ్యాపారులకు కేంద్రం అండగా నిలుస్తోందని ఆరోపించారు. పంటలకు కనీస మద్దతు ధర కల్పించి చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేశారు. రాహుల్ గళాన్ని నొక్కవచ్చునేమో కానీ ప్రజల హృదయాల నుంచి తొలగించలేరని అన్నారు. మతరాజకీయాలు చేస్తున్న బీజేపీని తుదముట్టించే వరకు కాంగ్రెస్ పోరాటం చేస్తుందని అన్నారు.
Read also: Bhatti vikramarka: బెల్లంపల్లి లో పీజీ కాలేజ్ ఏర్పాటు చేయండి.. భట్టికి విద్యార్థుల వినతి పత్రం
భారతదేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు అందరూ ముందుకు రావాల్సిన అవసరం ఉందని పిలుపు నిచ్చారు. ఆర్థిక నేరగాళ్ల విషయంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని అన్నారు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ప్రజాస్వామ్య పరిరక్షణకు అండగా నిలుస్తుందని తెలిపారు. బీజేపీ పార్టీపై పోరాటంకు అన్నీ పార్టీల మద్దతు తీసుకుంటామని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ పార్లమెంట్ సభ్యత్వం రద్దు విషయంలో అప్రజాస్వామిక చర్యలను కేసీఆర్ ఖండించడంపై స్వాగతిస్తున్నామని తెలిపారు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని బాండ్ పేపర్ రాసిచ్చి అర్వింద్ మాట తప్పారని మండిపడ్డారు. చక్కర ఫ్యాక్టరీ ప్రారంభిస్తామని టిఆర్ ఎస్ మాట ఇచ్చి నిలబెట్టుకోలేదని, బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు దొంగలే అంటూ ఎం.ఎల్.సి. జీవన్ రెడ్డి మండిపడ్డారు.
ద్రాక్ష పండ్లు తినడం మిస్ అవుతున్నారా.. అయితే ఇక అంతే సంగతి..