మా పార్టీ నాయకులపై కేసులు పెట్టిన పోలీసులపై దండయాత్ర చేస్తామని ప్రకటించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి… హైదరాబాద్ మీడియాతో మాట్లాడిన ఆయన.. రేపు (21వ తేదీన) ఖమ్మం వెళ్తున్నామని వెల్లడించారు.. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ నేతలపై పీడీ యాక్టులు పెట్టిన కేసుల సంగతి తేలుస్తామన్న ఆయన.. ఇప్పటికే సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కూడా మాట్లాడారు.. అందరం కలిసి వెళ్తున్నాం.. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి, నేను.. ఇలా అందరం కలిసే వెళ్తాతం.. కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.. ఖమ్మలో ఏం చేస్తాం అనేది చూపిస్తామన్న ఆయన.. మా పార్టీ నాయకులపై కేసులు పెట్టిన పోలీసులపై దండయాత్ర చేస్తామని హెచ్చరించారు.. ఇక, తమ పర్యటనలో బీజేపీ కార్యకర్త కుటుంబాన్ని కూడా పరామర్శిస్తామని వెల్లడించారు జగ్గారెడ్డి.. పార్టీ కార్యకర్త లాగా కాదు.. సాధారణ పౌరుడిగా పరామర్శ చేస్తామన్నారు.
Read Also: BJP: ఆ ఆత్మహత్యలపై సీబీఐ విచారణ జరిపించాలి.. గవర్నర్‌కు బీజేపీ వినతి