Ranga Reddy:స్కూల్ బస్సు బీభత్సం.. తృటిలో తప్పిన పెనుప్రమాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని పెద్దఅంబర్ పేట్ లో ప్రైవేట్ స్కూల్ బస్సు బీభత్సం సృష్టించింది. కండర్ షైర్ స్కూల్ కు చెందిన బస్సు బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో.. స్కూల్ సెక్యూరిటీ గార్డుపైకి బస్సు దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో విద్యార్థులంతా స్కూల్ లోపలికి వెళ్లిపోవడంతో.. పెనుప్రమాదం తప్పినట్లయింది.
కాగా.. ప్రమాదంలో సెక్యూరిటీ గార్డుకు తీవ్రగాయాలవ్వడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. బస్సు ప్రమాదం గురించి ప్రశ్నించిన విద్యార్థుల తల్లిదండ్రులపై సిబ్బంది దౌర్జన్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read
అయితే ఇటువంటి ఘటనే Feb 17, 2021న హైదరాబాద్ మహానగరంలో టోలిచౌకి బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఓ ప్రైవేటు పాఠశాల బస్సు అదుపు తప్పి బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా, పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. అతి వేగంగా వచ్చిన ఓ ఇంటర్నేషనల్ స్కూల్ బస్సు టోలిచౌకి ప్రాంతంలో వాహనాలపైకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో ఏడు వాహనాలను ఢీకొనడంతో, అందులో నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే, బస్సు బ్రేక్ ఫెయిల్ అవ్వడం వల్ల ఈ సంఘటన జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదానికి కారణమైన డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
తాజావార్తలు
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
-
OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!