తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. స్కూల్ వ్యాన్ రైల్వే ట్రాక్ దాటుతుండగా అకస్మాత్తుగా రైలు వచ్చేసింది. దీంతో స్కూల్ వ్యాన్ తుక్కుతుక్కు అయిపోయింది. ఇద్దరు విద్యార్థులు మృతిచెందగా.. మరి కొందరు విద్యార్థులు గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో దారుణం జరిగింది. శ్రీ కీర్తన స్కూల్ బస్సు కింద పడి నాలుగేళ్ల చిన్నారి గిలాగిలా కొట్టుకుంటూ ప్రాణాలు కోల్పోయింది. చిన్నారి రాకను తల్లి చూస్తుండగానే ఆమె కళ్ల ముందే బస్సు చక్రాల కింద నలిగి ప్రాణాలు కోల్పోయింది. శ్రీ కీర్తన హైస్కూల్ లో చిన్నారి హరి ప్రియ యూకేజీ చదువుతోంది. స్కూల్ ముగిసిన అనంతరం బస్సు దిగి ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
School Bus Caught Fire: ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ లోని కౌశాంబి ప్రాంతంలో గురువారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. ఉదయం 7:30 గంటల సమయంలో శ్రీశ్రీ రెసిడెన్సీ వెనుక ఆగి ఉన్న స్కూల్ బస్సులో మంటలు చెలరేగినట్లు సమాచారం. ఘటన గురించి సమాచారం అందిన వెంటనే ఫైర్ స్టేషన్ వైశాలి నుండి చీఫ్ ఫైర్ ఆఫీసర్, అతని బృందం వెంటనే రెండు అగ్నిమాపక వాహనాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ తర్వాత కాలిపోతున్న బస్సుకు మంటలను అదుపులోకి…
హర్యానాలోని పంచకులలో ఘోర ప్రమాదం జరిగింది. 45 మంది పిల్లలతో వెళ్తున్న స్కూల్ బస్సు లోయలో పడింది. చిన్నారుల బస్సులోంచి చెల్లాచెదురుగా పడిపోయారు. టిక్కర్ తాల్ సమీపంలో బస్సు వెళ్తుండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు లోయలోకి పడిపోయింది.
పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న బస్సుకు తృటిలో ప్రమాదం తప్పిన ఘటన సికింద్రాబాద్ జవహర్ నగర్ పరిధిలో చోటుచేసుకుంది. ఒక్కసారిగా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమీపంలో చెట్ల పొదల్లోకి పాఠశాల బస్సు వేగంగా దూసుకెళ్లడంతో విద్యార్థులు భయాందోళన గురయ్యారు. డంపింగ్ యార్డ్ వద్ద ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ను తప్పించే క్రమంలో రోడ్డు దాటి అదుపుతప్పి చెట్లలోకి పాఠశాల బస్సు దూసుకెళ్లింది. బస్సులో ఉన్న విద్యార్థులు భయాందోళనకు గురికాగా స్థానికులు వెంటనే అప్రమత్తమై విద్యార్థులను బస్సులో నుండి బయటకు…
Ganja Bach: హైదరాబాద్ నగరంలో రాత్రిపూట రోడ్డు పక్కన టిఫిన్లు విక్రయిస్తున్నారు. అంతే కాకుండా రాత్రి ఏ సమయంలో అయినా బయటకు వెళ్లి టిఫిన్ చేసేందుకు యువత కూడా జంకుతున్నారు.
ఇండోనేషియాలోని జావా ద్వీపంలో హైస్కూల్ విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సు కారు, మూడు మోటార్‌సైకిళ్లను ఢీకొట్టడంతో 11 మంది మరణించగా.. చాలా మంది గాయపడ్డారు.