Accident : పెద్దఅంబర్ పేట్‌లో ఘోర విషాదం చోటు చేసుకుంది. స్కూల్ బస్సు కింద పడి రిత్విక అనే నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. హయత్‌నగర్ శ్రీచైతన్య టెక్నో స్కూల్ లో రిత్విక LKG చదువుతోంది. అయితే.. రోజులాగే ఈ రోజు కూడా బాలిక బస్సు దిగింది. అయితే.. బాలిక దిగి వెళ్తుండగా ఒక్కసారిగా బస్సు రివర్స్ చేయడం ప్రమాదం చోటు చేసుకుంది. కుమార్తె మరణ వార్తతో బాలిక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి…
Robbers attacked: పెద్ద అంబర్ పేటలో పోలీసులపై దొంగల కాల్పులు కలకలం రేపాయి. పోలీసులపై కత్తులతో దాడి చేసి పారిపోతున్న దొంగలపై పెద్ద అంబర్ పేట ఔటర్ రింగ్ రోడ్డు వద్ద పోలీసుల కాల్పులు జరిపారు.
నగరంలోని పెద్దఅంబర్ పేట్ ఔటర్ రింగ్గు రోడ్డు వద్ద కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. విశాఖపట్నం నుండి హైదరాబాద్ కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అలర్ట్ అయిన కారువారు బయటకు పరుగులు తీసారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని పెద్దఅంబర్ పేట్ లో ప్రైవేట్ స్కూల్ బస్సు బీభత్సం సృష్టించింది. కండర్ షైర్ స్కూల్ కు చెందిన బస్సు బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో.. స్కూల్ సెక్యూరిటీ గార్డుపైకి బస్సు దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో విద్యార్థులంతా స్కూల్ లోపలికి వెళ్లిపోవడంతో.. పెనుప్రమాదం తప్పినట్లయింది. కాగా.. ప్రమాదంలో సెక్యూరిటీ గార్డుకు తీవ్రగాయాలవ్వడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. బస్సు ప్రమాదం గురించి ప్రశ్నించిన…
బహుళ అంతస్తుల కట్టడాలపై డిస్ట్రిక్ టాస్క్ ఫోర్స్, హెచ్‌ఎండీఏ ఫోకస్ పెట్టింది. బుధవారం మరో పది అక్రమ నిర్మాణాల కూల్చివేసింది. వాటిల్లో ఐదు అంతస్తుల భవనాలు, రెండు ఎకరాల్లో గోదాములు ఉన్నాయి. మొత్తంగా మూడు రోజుల్లో 33 నిర్మాణాలపై టాస్క్ ఫోర్స్ బృందం కూల్చి వేసింది.మూడో రోజు తూంకుంట, మణి కొండ, శంషాబాద్, పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీలలో కొనసాగిన కూల్చివేతలు. అనధికారిక భవనాలు, అక్రమ నిర్మాణాల విషయంలో డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్, హెచ్ఎండీఎ యంత్రాంగం వేగాన్ని…
హైదరాబాద్ నగరంలోని పెద్ద అంబర్‌పేట ఔటర్ రింగ్‌రోడ్డుపై శనివారం ఉదయం రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని శంషాబాద్ నుంచి ఘట్‌కేసర్ వైపు వెళ్తున్న ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో కారులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అటుగా వెళ్తున్న ఓ వాహనదారుడు కారులో మంటలను చూసి డ్రైవర్‌ను బయటకు లాగడంతో ప్రమాదం తప్పింది. డ్రైవర్‌కు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బాధితుడు ఈసీఐఎల్‌కు దమ్మాయిగూడకు చెందిన మయూర్‌గా పోలీసులు గుర్తించారు.…
హైదరాబాద్ శివారులోని పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.. మున్సిపాలిటీ పరిధిలోని స్వాల్ కార్పొరేషన్ లిమిటెడ్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.. హఠాత్తుగా ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.. దీంతో.. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. ఐదు ఫైరింజన్ల సమాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.. అయితే, గోదాంలోకి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో జేసీబీల సహాయంతో గోడలు కూల్చివేస్తున్నారు అధికారులు.. గోదాంలో పిచికారీ మందులు మరియు సీడ్స్ ఉన్నట్లుగా…