బీజేపీపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మెదక్ పార్లమెంట్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుదని తెలిపారు. రాముడు దేవుడు.. కానీ ఆయన్ని ఓ పార్టీకి లీడర్ని చేశారని విమర్శించారు. మెదక్లో ఆ పార్టీ పేరే ఎత్తకండి అని అన్నారు. ఎమోషన్లకు పోయి ఆ పార్టీ వ్యక్తిని గిల్ల వద్దని కార్యకర్తలకు జగ్గారెడ్డి సూచించారు. మెదక్ ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన గడ్డపై మళ్ళీ కాంగ్రెస్ జెండా ఎగరేద్దాం అని పేర్కొన్నారు.
Telangana Elections 2023: ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అభ్యర్థుల టెలీ ప్రచారం కూడా జోరందుకుంది. సోషల్ మీడియా పెరిగిన తర్వాత ఈ తరహా ప్రచారం తగ్గినా ఈసారి మళ్లీ ఊపందుకుంది.
దున్నరాజుల విన్యాసాలు వీక్షకుల హర్షధ్వానాల మధ్య నేటి నుంచి మహానగరంలో సదర్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. దీపావళి తర్వాత రెండో రోజు సదర్ ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీ. అయితే నిన్న గ్రహణం వుండటంతో.. సదర్ ఉద్సవాలను నేడు, రేపు చేయాలని నిర్వహకులు నిర్ణయించారు.