CM Revanth Reddy: నేటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. ఇవాళ ఉదయం మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ నామినేషన్‌కు హాజరుకానున్న సీఎం రేవంత్‌రెడ్డి. సాయంత్రం నాలుగు గంటలకు హెలికాప్టర్ మహబూబాబాద్ చేరుకొని జన జాతర సభలో పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి మానుకోటకు రానున్న సీఎంకు భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యవేక్షణలో జన సమీకరణ ఏర్పాట్లు చేశారు. మహబూబాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో సభకు భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు.
Read also: PBKS vs MI: సూర్యుడు రేపు ఉదయించినట్లే.. మేం విజయాలు సాధిస్తాం: సామ్
కాగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. మానుకోట కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి నామినేషన్ దాఖలు చేయనున్నారు. అక్కడి నుంచి జరిగే బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీకి చెందిన జాతీయ నేతలు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచారంలో నిమగ్నమయ్యారు. నేటి నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్, మానుకోట నియోజకవర్గాల్లో ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు.
Read also: DD News: రంగు మారిన డీడీ న్యూస్ చిహ్నం.. ప్రసార భారతి కాదు ప్రచార భారతి అంటూ..
ఇక రేపు 20 న మెదక్ అభ్యర్థి నీలం మధు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. 20 న సాయంత్రం కర్ణాటక లో ప్రచారంలో పాల్గొని, 21న భువనగిరిలో పార్టీ అభ్యర్థి చామల కిరణ్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. 22న ఉదయం ఆదిలాబాద్ లో నిర్వహించే సభలో పాల్గొంటారు. 23న నాగర్ కర్నూల్ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. 24న ఉదయం జహిరాబాద్, సాయంత్రం వరంగల్ లో నిర్వహించే సభల్లో సీఎం రేవంత్ పాల్గొననున్నారు.
SSMB29 : వావ్..సూపర్ స్టార్ లుక్ న్యూ లుక్ అదిరిపోయిందిగా..