Sam Curran about PBKS vs MI Match in IPL 2024: సూర్యుడు రేపు ఉదయించినట్లే.. తాము విజయాలు సాధిస్తాం అని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ సామ్ కరణ్ చెప్పుకొచ్చాడు. దురదృష్టవశాత్తు మరో మ్యాచ్‌ను తృటిలో చేజార్చుకున్నాం అని, గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడితే జీర్ణించుకోవడం చాలా కష్టం అని పేర్కొన్నాడు. యువ ప్లేయర్స్ శశాంక్ సింగ్, అషుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటారని సామ్ ప్రశంసించాడు. లక్ష్య ఛేదనలో పంజాబ్ 19.1 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటై 9 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
మ్యాచ్ అనంతరం పంజాబ్ కింగ్స్ కెప్టెన్ సామ్ కరణ్ మాట్లాడుతూ… ‘మరో క్లోజ్ మ్యాచ్. తృటిలో మ్యాచ్‌ను కోల్పోయాం. మా జట్టుకు ఇలాంటి మ్యాచ్‌లు అలవాటుగా మారాయి. అషుతోష్ శర్మ మరోసారి మంచి ఇన్నింగ్స్ ఆడాడు. కానీ దురదృష్టవశాత్తు మరొక ఓటమిని చవిచూడక తప్పలేదు. గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడితే జీర్ణించుకోవడం చాలా కష్టం. ఇన్నింగ్స్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోవడం మా విజయవకాశాలను దెబ్బతీసింది. యువ ఆటగాళ్లు జట్టును విజయానికి దగ్గరగా తీసుకొచ్చిన విధానం బాగుంది’ అని అన్నాడు.
Also Read: PBKS vs MI: అతడు మమ్మల్ని భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
‘శశాంక్ సింగ్, అషుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్‌తో జట్టును విజయం వైపు నడిపారు. ఇద్దరూ మంచి కాన్ఫిడెన్స్‌తో బ్యాటింగ్ చేశారు. పేసర్ల బౌలింగ్లో అషుతోష్ ఆడిన స్వీప్స్, భారీ సిక్సర్లే అతని ఆత్మవిశ్వాసాన్ని తెలియజేస్తున్నాయి. అతని ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉంది. క్లోజ్ మ్యాచ్‌లను కోల్పోవడం నిరుత్సాహపరుస్తుంది. అయితే జట్టులో చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. మాపై మాకు ఇంకా నమ్మకం ఉంది. ఈ పరిస్థితులను మేం మార్చగలం. సూర్యుడు రేపు ఉదయించినట్లే.. మేం విజయాలు సాధిస్తాం’ అని సామ్ కరణ్ ధీమా వ్యక్తం చేశాడు.