Revanth Reddy: నేడు హస్తినకు రేవంత్ రెడ్డి, భట్టి.. ప్రధానితో కీలక భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy: మరోసారి ఢిల్లీకి తెలంగాణ సీఎం వెళ్లనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హస్తినకు పయనం కానున్నారు. పీఎం మోడీ అపాయింట్మెంట్ ఫిక్స్ కావడంతో సీఎం, డిప్యూటీ సీఎం ఇవాళ మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో హస్తినకు వెళ్లనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి ప్రధాని మోడీని కలవనున్నారు. మర్యాదపూర్వకంగా భేటీ కానున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఏ రాష్ట్రంలో అయినా ఎన్నికలు పూర్తై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానిగా ఎవరు ఉంటే వారిని కలవడం ఆనవాయితీగా వస్తోంది. కాగా, ఈ ప్రత్యేక సమావేశంలో విభజన సమస్యలతో పాటు పెండింగ్ ప్రాజెక్టులు, వాటి అనుమతులపై ప్రధానితో చర్చించనున్నారు. అలాగే కేసీఆర్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల పరిస్థితిపై కూడా ప్రధాని మోడీతో చర్చించనున్నట్లు సమాచారం. అంతేకాకుండా.. తెలంగాణలో మరోసారి సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా.. ప్రధాని మోడీతో భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీ పెద్దలను కూడా కలవనున్నారు.
Read also: Margasira Purnima: కోరుకున్నది నెరవేరాలంటే ఈ స్తోత్రం వినండి
Also Read
- Hyderabad: బయట లగ్జరీ.. లోపల పురుగులు.. గచ్చిబౌలిలోని ప్రముఖ రెస్టారెంట్ అసలు రంగు బట్టబయలు..
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రతి కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం సేకరించాలన్నారు. కాబట్టి ప్రభుత్వ పథకాలను అర్హులైన వారికి అందజేసేందుకు ఈ కుటుంబ సర్వే ఎంతగానో ఉపయోగపడుతుందని రేవంత్ సర్కార్ భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. గత ప్రభుత్వం నిర్వహించిన సర్వేకు భిన్నంగా ఈ సర్వేలో 32 రకాల సమాచారాన్ని సమగ్రంగా సేకరించి.. ప్రతి కుటుంబాన్ని నిశితంగా పరిశీలించేందుకు రేవంత్ ప్రభుత్వం సూచనప్రాయంగా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికలు, నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించే అవకాశం ఉంది. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ విషయమై కాంగ్రెస్ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చర్చించనున్నారు. అయితే వీటిని భర్తీ చేయాలంటే ముందుగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. అక్కడి నుంచి నేరుగా రేపు (28)న నాగ్ పూర్ లో జరిగే ఆవిర్భావ దినోత్సవంలో సీఎం, డిప్యూటీ సీఎం పాల్గొంటారు.
Hanuman Chalisa: మంగళవారం నాడు హనుమాన్ చాలీసా వింటే అదృష్టం పడుతుంది
తాజావార్తలు
-
Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఒక్కరోజులోనే షాకిచ్చిన బులియన్ మార్కెట్!
-
Cyber Crime: ఆన్లైన్ డేటింగ్ ఉచ్చులో మహిళా న్యాయమూర్తి.. జడ్జిగారి ‘రోమాన్స్ స్కామ్’ కథ వింటే నోరెళ్లబెడతారు!
-
Ben Stokes-ECB: పూర్తిస్థాయి నిషేధంపై ఆలోచిస్తున్నాం.. బాంబ్ పేల్చిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు!
-
The Odyssey : ‘ది ఒడిస్సీ’కి భయపడి ప్రీ పోన్ చేసుకుంటోన్న బాలీవుడ్ ఫిల్మ్స్
-
2027 ODI World Cup: హార్దిక్ పాండ్యా ఎందుకు.. ఆ తెలుగోడే ‘సరైనోడు’!
ట్రెండింగ్
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..