CM Revanth Reddy : నేనే రాజు.. నేనే మంత్రి.. ఢిల్లీ వేదికగా సీఎం రేవంత్ పవర్‌ఫుల్ కామెంట్స్..!
- చిట్‌చాట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
- తెలంగాణకు నేనే రాజు.. నేనే మంత్రి.. నాకు ఎవరూ పోటీకాదు
- 2029లో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి
- నేను ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించను
- నన్ను అన్నవాళ్లనే.. నేను అంటున్నా
- పదిన్నరేళ్లపాటు నేనే సీఎంగా ఉంటా-సీఎం రేవంత్‌రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా నిర్వహించిన మీడియా చిట్‌చాట్‌లో తనదైన శైలిలో విపక్షాలపై విరుచుకుపడ్డారు. “తెలంగాణకు నేనే రాజు.. నేనే మంత్రి.. నాకు ఎవరూ పోటీ కాదు” అంటూ తన రాజకీయ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. రాబోయే పదిన్నరేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని ధీమా వ్యక్తం చేసిన రేవంత్, 2029లో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయని జోస్యం చెప్పారు. తాను ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించనని, తనను అన్నవాళ్లకే తాను బదులిస్తున్నానని స్పష్టం చేశారు. “నా మతం, నా పేరు మార్చి మాట్లాడినప్పుడు నాకు దుఃఖం ఉండదా?” అని ప్రశ్నిస్తూ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలపై ఘాటుగా స్పందించారు.
iPhone 18 Pro Leaks: ఐఫోన్ 17 కంటే 5 Major Upgrades.. 2nm చిప్‌సెట్ అరుపులే.!
Also Read
- Secunderabad Bonalu 2026: సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాలపై క్లారిటీ.. తేదీ, పూర్తి వివరాలు ఇవే..
- ACB Raids: ఆదాయానికి మించిన ఆస్తులు.. డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ దాడులు.!
- Hyderabad: ఘనంగా మిస్ యూనివర్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2026 గ్రాండ్ ఫినాలే.!
- OTR : తెలంగాణ మంత్రుల శాఖల మార్పు పై చర్చలు
రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో తాను ఏ రాష్ట్రంతోనూ పోల్చుకోనని, పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను సహనంతో కేంద్రాన్ని అడిగి పరిష్కరించుకుంటున్నామని రేవంత్ తెలిపారు. కాలేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ కోసం సీబీఐ డైరెక్టర్‌తో పాటు కేంద్ర హోంశాఖకు ఇప్పటికే లేఖ రాశామని, అయితే కేంద్రం నుంచి ఇప్పటి వరకు స్పందన లేదని గుర్తు చేశారు. కాళేశ్వరంలో నీళ్లు నింపితే ప్రాజెక్టు కూలిపోయే ప్రమాదం ఉందని, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు పూర్తిస్థాయి స్టడీ చేయిస్తున్నామని వెల్లడించారు. విద్యుత్ కమిషన్ కేసును కూడా కేంద్రానికే అప్పగించేందుకు తాము సిద్ధమని ప్రకటించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరిందని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రభాకర్ రావు విచారణ తర్వాత కీలక మలుపులు చోటు చేసుకున్నాయని తెలిపారు. “కిషన్ రెడ్డి ఏం చేస్తున్నారు? కేసీఆర్‌ను ఎందుకు లోపల వేయలేదు?” అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను విచారించిన ఈడీ.. ఫార్ములా-ఈ రేసులో స్పష్టంగా మనీ లాండరింగ్ కనిపిస్తున్నా కేటీఆర్‌ను ఎందుకు విచారించడం లేదని నిలదీశారు. బీజేపీ నాయకుడి మరణంపై స్థానిక పోలీసులపై నమ్మకం లేకపోతే సీబీఐ విచారణకు కూడా తాము సిద్ధమని, కేసీఆర్-కేటీఆర్‌లను రక్షించడానికే కిషన్ రెడ్డి అనవసర విమర్శలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు.
BYD Atto 3 Evo: BYD ఆట్టో 3 ఈవో.. బిగ్ బ్యాటరీ, 500 కి.మీ రేంజ్, స్టైలిష్ ఫీచర్లు..
తాజావార్తలు
-
Womens T20 World Cup: పాకిస్థాన్‌పై కొట్టడం అంటే ఆ మజానే వేరు.. ఫామ్‌లోకి వచ్చిన రిచా ఘోష్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
The Odyssey : ‘ది ఒడిస్సీ’కి ఎందుకంత భయపడుతున్నారు?
-
US Plane Crash: అమెరికా విమాన ప్రమాదం.. తెలుగు యువకుడు మృతి
-
Karan Johar: చివరికి మలయాళ దర్శకుడిని నమ్ముకున్న కరణ్ జోహార్
-
PM-Kisan: రైతులకు గుడ్ న్యూస్.. ఈ వారమే ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు.. డేట్ ఫిక్స్ చేసిన ప్రభుత్వం!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్‌లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?