Karan Johar: చివరికి మలయాళ దర్శకుడిని నమ్ముకున్న కరణ్ జోహార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు దర్శకుడిగా హిట్స్ మీద హిట్లు అందుకున్న బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్, 2023 నుంచి స్టార్ కిడ్స్ను స్టార్స్‌గా మార్చే పనిలో పడి కోట్లాది రూపాయలు నష్టపోవడమే కాదు, తన తండ్రి ఎంతో కష్టపడి నిర్మించిన ‘ధర్మా ప్రొడక్షన్స్’ అనే సినిమా నిర్మాణ సంస్థలో దాదాపు 50 శాతం వాటాను సైతం అమ్ముకునే స్థితికి చేరుకున్నాడు. అంతేకాదు, రీసెంట్ టైమ్స్‌లో కరణ్, రణబీర్ కపూర్‌ను హీరోగా పెట్టి ప్రొడ్యూస్ చేసిన ఒక్క ‘బ్రహ్మాస్త్ర’ మూవీ తప్ప మరే మూవీ ఆయనకు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు కూడా తీసుకురాలేదు.
దీంతో ఈసారి తన నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న మూవీ పాన్ ఇండియా లెవెల్లో సూపర్ డూపర్ హిట్ కావాలని, సూపర్ ఫామ్‌లో ఉన్న మలయాళ దర్శకుడు రాహుల్ సదాశివన్ తో చేతులు కలిపాడు. ఈ మేరకు ‘భూతకాలం’, ‘భ్రమయుగం’, ‘డైస్ ఐరా’ వంటి బ్యాక్ టు బ్యాక్ హారర్ చిత్రాలు డైరెక్ట్ చేసిన రాహుల్ సదాశివన్ నెక్స్ట్ మూవీలో తాను కూడా భాగం కానున్నట్లు తన ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు.
Also Read
- Immortal Success Surprise : ఇమ్మోర్టల్ సక్సెస్ సెలబ్రేషన్స్.. హీరోకు నిర్మాత వెరైటీ గిఫ్ట్! ట్రెండ్ మార్చేశాడుగా..
- Suriya: సింగం ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
- Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
- Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
‘పృథ్వీరాజ్ సుకుమారన్’, ‘మంజు వారియర్’ హీరో హీరోయిన్లుగా రాబోతున్న ఈ హారర్ బ్యాక్‌డ్రాప్ మూవీని స్వయంగా పృథ్వీరాజ్ నే తన సొంత బ్యానర్లో నిర్మిస్తుండగా, తాజాగా మూవీ టైటిల్ పోస్టర్‌ను కరణ్, పృథ్వీ కలిసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. నిజానికి మలయాళ భాషలో ‘ఒడియన్’ అంటే తాంత్రిక శక్తులతో జంతువు రూపంలోకి మారగలిగే వ్యక్తి అని అర్థం. కేరళలోని వల్లువనాడ్ ప్రాంతంలో ఓ ప్రాచీన తెగకు చెందిన ఈ ఒడియన్లు, రాత్రుల్లో ఇతరులను భయపెట్టేందుకు ఈ తాంత్రిక విద్యను అభ్యసించేవారు అని వినికిడి.
దీంతో ‘భూతకాలం’ లాంటి ఓ విభిన్న హారర్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన రాహుల్ సదాశివన్, ఇప్పుడు ఈ చేతబడుల అంశాలు ఉన్న కాన్సెప్ట్‌తో మూవీని ఇంకెంత భయంకరంగా తీస్తారో అనే హైప్ సోషల్ మీడియాలో జనరేట్ అయ్యింది. అలాగే ట్రయాంగిల్ లవ్ స్టోరీస్, ఫ్యామిలీ డ్రామాస్‌తో ప్రసిద్ధి చెందిన కరణ్ జోహార్ బ్యానర్‌కు ఈ మలయాళ హారర్ మూవీ పాన్ ఇండియా హిట్ ఇస్తుందో లేదో అనే డిస్కషన్ కూడా బి-టౌన్లో జోరుగా సాగుతోంది.
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!