CM Revanth Reddy : పద్మ పురస్కారాలకు ఎంపికైన వారికి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
- పద్మ పురస్కారాలకు ఎంపికైన వారికి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
- పద్మ పురస్కారాల్లో వివక్షపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తి
- ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాయాలని యోచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మ శ్రీ పురస్కారాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి ఎంపికైన ప్రముఖులకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. వైద్యరంగంలో విశేష సేవలు అందించిన డాక్టర్ డి. నాగేశ్వర్‌రెడ్డికి పద్మవిభూషణ్, సినిమా రంగంలో తనదైన ముద్ర వేసిన నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్, ప్రజా వ్యవహారాల విభాగంలో మంద కృష్ణ మాదిగకు, కళలు, సాహిత్యం, విద్యా విభాగాల్లో కే.ఎల్.కృష్ణ, మాడుగుల నాగఫణిశర్మ, దివంగత మిర్యాల అప్పారావు, రాఘవేంద్రాచార్య పంచముఖిలకు పద్మశ్రీ పురస్కారాలు దక్కడంపై ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. తాము ఎంచుకున్న రంగంలో చేసిన కృషి.. అంకితభావమే వారిని దేశంలోని ఉన్నత పురస్కారాలకు ఎంపికయ్యేందుకు కారణమయ్యాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
ఇది తెలంగాణ ప్రజలకు అవమానం : సీఎం రేవంత్ రెడ్డి
Also Read
పద్మ పురస్కారాల్లో తెలంగాణకు అవమానం జరిగిందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన గద్దర్ (పద్మవిభూషణ్), చుక్కా రామయ్య (పద్మభూషణ్), అందెశ్రీ (పద్మభూషణ్), గోరటి వెంకన్న (పద్మశ్రీ), జయధీర్ తిరుమలరావు (పద్మశ్రీ) వంటి ప్రముఖులను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకవడం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను అవమానించడమేనని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రులు, అధికారులతో జరిగిన సమావేశంలో ఈ అంశంపై ముఖ్యమంత్రి ఎ..రేవంత్ రెడ్డి చర్చించారు. తెలంగాణకు పద్మ పురస్కారాల్లో జరిగిన అన్యాయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాయాలనే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నారు. తెలంగాణ సమాజానికి వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన గద్దర్, చుక్కా రామయ్య, అందెశ్రీ, గోరటి వెంకన్నలను గుర్తించకపోవడం తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవానికి భంగం కలిగించడమేనని సీఎం పేర్కొన్నారు. 139 మందికి పురస్కారాలు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కనీసం అయిదు పురస్కారాలు ప్రకటించకపోవడంపై సీఎం ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
Padma awards 2025: పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం.. పద్మవిభూషణ్ ఎవరెవరికి దక్కాయంటే?
తాజావార్తలు
-
New Railway Station: మరో కొత్త రైల్వే స్టేషన్ అందుబాటులోకి.. జులై 17న ప్రారంభం..
-
Grand Comeback: హ్యాట్రిక్ ప్లాన్‌తో వస్తున్న హీరో.. గ్రాండ్ కంబ్యాక్‌కు మాస్టర్ స్ట్రాటజీ!
-
PoK Protest: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో హింసాకాండ.. 12 మంది మృతి, రేంజర్ల మోహరింపు..
-
Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త.. ఇక నిమిషాల్లోనే సిలిండర్ డెలివరీ..
-
Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!