తెలంగాణ శాసనసభలో కృష్ణా, గోదావరి నదీ జలాలపై జరుగుతున్న చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరోక్షంగా ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్పై విమర్శలు గుప్పించారు. బహిరంగ సభల్లో మాట్లాడటం కంటే, చట్టసభలో మాట్లాడే మాటలకు ఎంతో విలువ , బాధ్యత ఉంటుందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలు ఇచ్చే సూచనలను ప్రభుత్వం స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నా, వారు సభకు రాకపోవడం దురదృష్టకరమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
అసెంబ్లీకి రాకపోవడం విచారకరం గత రెండేళ్లుగా ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడంపై రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. “కేసీఆర్ గారు తన సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ప్రభుత్వానికి విలువైన సలహాలు, సూచనలు ఇస్తారని మేము ఆశించాం. గతంలో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ వారిని అవమానించినా, రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము సభకు వచ్చి మా వాదన వినిపించేవాళ్లం. కానీ ఇప్పుడు ప్రతిపక్ష నేతలు సభకు రాకపోవడం వల్ల అంతిమంగా ప్రజలకే అన్యాయం జరుగుతుంది” అని ఆయన అన్నారు.
US Attacks Venezuela: వెనిజులాపై అమెరికా దాడి వేళ.. బంగారం, వెండి ధరలకు రెక్కలొచ్చినట్టేనా?
జలాలపై గందరగోళం వద్దు నదీ జలాల అంశంపై కేసీఆర్ ఇటీవల ప్రెస్మీట్ పెట్టి మాట్లాడిన విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. ఇలాంటి కీలకమైన విషయాలను పార్టీ కార్యాలయాల్లో మాట్లాడితే ప్రజల్లో గందరగోళం నెలకొంటుందని, అందుకే వాస్తవాలను చర్చించడానికి అసెంబ్లీలో ప్రత్యేక చర్చ పెట్టామని తెలిపారు. కృష్ణా, గోదావరి జలాలపై వేర్వేరుగా చర్చించి, ఒక స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోందని, ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కృష్ణా జలాలపై వాస్తవాలను సభ ముందు ఉంచారని రేవంత్ రెడ్డి వివరించారు.
మహబూబ్నగర్ జిల్లాకు అన్యాయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ, ఆ తర్వాత జరిగిన బీఆర్ఎస్ పాలనలోనూ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు నీటి కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరు బిడ్డగా ఈ అన్యాయాన్ని సరిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ గారు ఇప్పటికైనా సభకు వచ్చి రాష్ట్రానికి ఉపయోగపడే సలహాలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోరారు.
Jana Nayakudu Trailer: ‘ముట్టుకోకు ముక్కలు చేస్తాడు’.. ‘జన నాయకుడు’ ట్రైలర్ వచ్చేసింది!