Mahesh Babu Viral Photo: సూపర్ స్టార్ మహేష్ బాబు ఎప్పుడు కనిపించినా ఫుల్ షర్ట్‌తో కనిపిస్తాడు. షర్ట్ లేకుండా కనిపించడం అంటే మహేష్‌కు ఎంతో సిగ్గు. చివరకు సినిమాల్లో కాకుండా షర్ట్ విప్పి తన బాడీని ఎప్పుడూ చూపించలేదు. షర్ట్ తీయాల్సి వస్తుందని చాలా సినిమాలను మహేష్ వదులుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే సాధారణంగా మహేష్ తన ఫొటోలు బయటకు రాకుండా ఎంతో జాగ్రత్తపడుతుంటాడు. కానీ అప్పుడప్పుడు మహేష్ బాబు అభిమానుల కెమెరాలకు చిక్కడంతో ఆ ఫొటోలు వైరల్ అవుతుంటాయి. అలాంటి కొన్ని ఫొటోలను మహేష్ అభిమానులు తెగ షేర్ చేస్తుంటారు. తాజాగా మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటోను షేర్ చేసింది. తాజాగా ఈ పిక్‌లో మహేష్ ఫస్ట్ టైమ్ షర్ట్ లేకుండా స్విమ్మింగ్ పూల్‌లో కనిపించాడు. అటు అభిమానులు కూడా మహేష్ బాడీని ఫస్ట్ టైమ్ చూస్తున్నాం అంటూ సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు.
సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మహేష్ చేతిలో రెండు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో ఒకటి త్రివిక్రమ్‌తో సినిమా కాగా మరొకటి జక్కన్న రాజమౌళితో. ఈ రెండు సినిమాలు ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. త్రివిక్రమ్ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ డేట్‌ను నిర్మాతలు ప్రకటించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 28న విడుదల చేస్తామని వెల్లడించారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పక్కా ప్రణాళికతో ఈ సినిమా షూటింగ్‌ను ఈ ఏడాది చివరిలోపు ఫినిష్ చేయాలని భావిస్తున్నారు. ఆ తర్వాతి రెండు నెలల్లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసి ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ బడ్జెట్ రూ.200 కోట్లు ఉంటుందని ఫిలింనగర్‌లో ప్రచారం జరుగుతోంది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ ఈ స్థాయిలో బడ్జెట్ పెడుతుండటం ఇదే తొలిసారి.