జూలై 18వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ నేడు టీఆర్‌ఎస్ ఎంపీలతో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. ఈసమావేశం ప్రగతిభవన్‌లో మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమవుతుంది. ఈ సమావేశంలో పార్లమెంటు ఉభయ సభల్లో అనుసరించాల్సిన విధి, విధానాలు, కేంద్రాన్ని నిలదీసే అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. అయితే.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలపై పోరాటాలని పిలుపునివ్వనున్నారు. ఈనేపథ్యంలో.. అన్ని రంగాల్లోనూ తెలంగాణకు నష్టం చేసేలా కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై పార్లమెంటు వేదికగా…