cm kcr inagreates eight medical colleges: తెలంగాణ రాష్ట్రంలోని ఎనిమిది కొత్త జిల్లాలో నిర్మించిన మెడికల్ కాలేజీలను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. నేడు ప్రగతి భవన్ నుంచి ఆయా కాలేజీలకు సీఎం ప్రారంభోత్సవం చేశారు. ఇక మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబాబాద్, కొత్తగూడెం, సంగారెడ్డిలో కొత్తగా నిర్మించిన కాలేజీలను ప్రారంభించారు. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఒకనాడు అనేక సమస్యలతో ఎన్నో రకాల అవస్థలు పడింది తెలంగాణ రాష్ట్రం అన్నారు. వైద్య రంగంలో దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని అన్నారు. మహబూబాబాద్, వనపర్తి లాంటి ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు వస్తాయని ఎన్నడూ అనుకోలేదన్నారు. స్వరాష్ట్రం ఏర్పడింది కాబట్టే ఇవ్వాళ ఇన్ని మెడికల్ కాలేజీలు ఏర్పడ్డాయని తెలిపారు.
Read also: Flordelis Dos Santos: భర్తను చంపేందుకు 6సార్లు ప్లాన్.. కట్ చేస్తే..
మంత్రి హరీష్ రావు తో పాటు…వైద్య శాఖకు శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలిపారు. * ఇప్పుడు 18 కు పెరిగాయి…మరో 17 కాలేజీలు మనకు రావాలన్నారు. వచ్చే ఏడాది వరకు మిగిలిన 17 జిల్లాలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకుందామన్నారు. గతంతో పోల్చితే మూడు రేట్ల మెడికల్ సీట్ల కెపాసిటీ పెరిగిందని పేర్కొన్నారు. మెడికల్, పీజీ, సూపర్ స్పెషాలిటీ సీట్లు తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా పెరిగాయని అన్నారు. దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాలకు ఇది మంచి అవకాశం మని అన్నారు. జనాభా ప్రాతిపదికన వైద్య రంగం తెలంగాణ రాష్ట్రం పటిష్టంగా ఉందన్నారు. ప్రతీ జిల్లాకు వైద్యం అందేలా.. వైద్య రంగం అడుగులు వేస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. చిల్లర రాజకీయాలు చేయకుండా మిషన్ భగీరథ, కాకతీయ తరహాలో వైద్యం ప్రతీ గ్రామానికి వైద్యం అందాలని హెచ్చారించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, సీఎస్ సోమేశ్‌కుమార్, పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
Read also: BJP Leaders to Delhi: హైకమాండ్ నుంచి పిలుపు.. ఢిల్లీకి ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి
అయితే..ఈ 8 కాలేజీలతో అదనంగా 1,150 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. తెలంగాణ ఏర్పడేనాటికి రాష్ట్రంలో ఐదు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి…ఎనిమిదేండ్లలోనే 12 కొత్త కాలేజీలు ఏర్పాటు చేసుకొన్నాం…ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ చొప్పున 33 జిల్లాలకు కాలేజీలు వస్తాయి…అప్పుడు రాష్ట్రంలో 10 వేల ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. దీంతో..మన విద్యార్థులు వైద్య విద్యకోసం రష్యా, చైనా, ఉక్రెయిన్ వంటి దేశాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇక..రాష్ట్రంలోనే చదివేందుకు సరిపడా సీట్లు ఉంటాయి. అయితే..ఒక రాష్ట్రంలో ఒకేసారి 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభం కావడం, మెడికల్ విద్యార్థులకు 1,150 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రావడం దేశ చరిత్రలోనే బహుశా తొలిసారి. 2014 నుంచి ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్య ఐదు నుంచి పన్నెండుకు పెరిగిందని, ప్రభుత్వ, ప్రయివేటు వైద్య కళాశాలలు కలిపితే ప్రస్తుతం సీట్ల సంఖ్య 2,800 నుంచి 6,500కు పెరిగిందని సీఎం వివరించారు.
PM Narendra Modi: జీ20 వేదికగా పీఎం మోడీ సుదీర్ఘ ప్రసంగం.. ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు పిలుపు