Botsa Satyanarayana : ఏలూరు జిల్లా రీజనల్ కో ఆర్డినేటర్, శాసనమండలి విపక్ష నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రభుత్వం పై వరుస ఆరోపణలు చేశారు. కోవిడ్ తర్వాత పేదలకు మెరుగైన వైద్యం అందించాలన్న ఆలోచనతో మాజీ సీఎం వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలను ప్రారంభించారని, అందులో ఐదు కాలేజీలు నిర్మాణం పూర్తై రెండేళ్లుగా అడ్మిషన్లు కూడా కొనసాగుతున్నాయని ఆయన గుర్తుచేశారు. అయితే తాము నిర్మించిన మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు చేతుల్లోకి ఇవ్వడానికి…
AP High Court: వైద్య కళాశాలలను పీపీపీ మోడల్ కి ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దాఖలైంది. వైద్య కళాశాలను పీపీపీకి ఇవ్వటం ద్వారా థర్డ్ పార్టీకి హక్కులు కల్పించకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
AP High Court: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం.. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) మోడల్‌లో అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకుంది.. అయితే, దీనిపై పెద్ద దుమారమే రేగింది.. పీపీపీ మోడ్ అంటూనే మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌పరం చేయడంటూ అంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించింది.. ఇక, ఈ వ్యవహారం ఏపీ హైకోర్టు వరకు చేరింది.. పీపీపీ మోడల్‌లో మెడికల్ కాలేజీల అభివృద్ధిని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిల్…
మెడికల్ కాలేజీలవ్యవహారంపై ఆందోళనకు పిలుపునిచ్చింది వైసీపీ.. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీ వద్ద వైసీపీ ఎమ్మెల్సీలు ధర్నా చేశారు.. మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ సహా వైసీపీ ఎమ్మెల్సీలు హాజరయ్యారు.. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నూతన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చలో మెడికల్ కాలేజీ కు పిలుపు ఇచ్చిన వైసీపీ విద్యార్థి, యువజన విభాగాలు.
మెడికల్ కాలేజీల వ్యవహారంలో ఏపీలో పొలిటికల్ రచ్చ సాగుతూనే ఉంది.. ఈ అంశంపై స్పందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి విడదల రజిని కీలక వ్యాఖ్యలు చేశారు.. చరిత్ర చెరిపేస్తే చెరగదు.. రాష్ట్ర చరిత్రలో ఒకేరోజు ఐదు మెడికల్ కళాశాలలు ప్రారంభించిన ఘనత మా నాయకుడు జగన్ కే దక్కుతుందన్నారు..
వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేయడం తగదని అంటున్నారు అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్.. వైద్య కళాశాలలను ప్రభుత్వం నడపటానికి ఇబ్బంది ఏమిటి..? అంటూ ప్రశ్నించారు.
ఏపీలో మెడికల్ కాలేజీల అంశం హాట్ టాపిక్‌గా మారింది.. కూటమి ప్రభుత్వం పది ప్రాంతాల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.. ఆదోని.. మదనపల్లె. మార్కాపురం.. పులివెందుల.. పెనుగొండ.. పాలకొల్లు.. అమలాపురం.. నర్సీపట్నం.. బాపట్ల.. పార్వతీపురంలో ప్రైవేట్, పబ్లిక్ పార్టనర్షిప్ తో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.
మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం దారుణం అని మాజీ డిప్యూటీ సీఎం, పీఏసీ సభ్యుడు అంజద్ భాష పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేద ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు. పేద ప్రజలంటే సీఎం చంద్రబాబుకు అంత అలుసా? అని ప్రశ్నించారు. మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రైవేటీకరణ రద్దు చేస్తాం అని చెప్పారు. వందల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారని, ఆ డబ్బును ప్రభుత్వ ఆస్పత్రులకు కేటాయించవచ్చు కదా? అని…
Damodara Rajanarasimha : ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యవంతమైన పౌరులతోనే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రజల ఆరోగ్య సంరక్షణ ప్రభుత్వ ప్రధాన బాధ్యతగా ఉంది. అనారోగ్యం వల్ల ప్రజలు అప్పులపాలు కాకుండా, అవసరమైన అన్ని వైద్య సేవలు వారికి సమయానికి అందాలని ప్రభుత్వం కృషి చేస్తోంది. వైద్యం ఉచితంగా లభిస్తుందన్న భరోసా ప్రజలకు కలగాలి. ఆ భరోసాను కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీ కింద…