CM KCR : చుట్టూ చీకటిలో మణిదీపంలా నా తెలంగాణ వెలుగుతోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర సమితి 21వ అవిర్భవ వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఈ రోజు దేశంలో స్థాపిత విద్యుత్ శక్తి సామర్థ్యం 4,01,035 మెగావాట్ల విద్యుత్ శక్తి అందుబాటులో ఉందన్నారు. ఆధునిక సమాజం మొత్తం అభివృద్ధికి సంకేతాలుగా, ప్రగతికి నిదర్శనాలుగా భావించే కొలమానం విద్యుత్ అని, అటువంటి విద్యుత్ శక్తి దేశంలో అందుబాటులో ఉన్నా.. దాన్ని వినియోగించలేని ఆశక్త స్థితిలో భారతదేశం ఉందన్నారు.
4 లక్షల మెగావాట్ల విద్యుత్ శక్తి దేశంలో ఉంటే.. భారతదేశం ఏ రోజు కూడా 2 లక్షలకు మించి విద్యుత్ శక్తిని వాడడం లేదని కేసీఆర్ వెల్లడించారు. అంతేకాకుండా ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్‌లో కూడా భరించలేనటువంటి కరెంటు కోతలు, ఎండిపోతున్న పంట పొలాలు, రైతుల రాస్తారోకోలు దర్శనమిస్తున్నాయన్నారు. మన చుట్టూ సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రాల్లో కరెంటు కోతలు లేని రాష్ట్రాలు లేవన్నారు. ఆయా రాష్ట్రాల్లో ప్రకటిత కోతలు, అప్రకటిత కోతలతో ఇబ్బందులు పడని ప్రజలే లేరని ఆయన ఉద్ఘాటించారు.
Also Read
చుట్టూ చీకటితో అంధకారం ఉంటే.. ఒక మణి దీపంలా వెలుగుతున్నది నా తెలంగాణ అని గర్వంగా చెప్పుకుంటున్నానని ఆయన వ్యాఖ్యానించారు. 7 ఏళ్ల క్రితం తెలంగాణలో కూడా కరెంటు కోతలు ఉండేవని, కానీ ఆ తెలంగాణ నుంచి ఇప్పుడు 24 గంటలు నిర్వారామంగా కరెంటు ఇచ్చే తెలంగాణగా ఎలా అభివృద్ధి చెందిందో.. అదే దేశంలో ఎందుకు సాధ్యం కావడం లేదని కేసీఆర్ ప్రశ్నించారు.
తాజావార్తలు
-
SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
-
God of War: ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై త్రివిక్రమ్ నిర్లక్ష్యం? ‘గాడ్ ఆఫ్ వార్’ సంగతేంటి!
-
Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్ గెలుచుకున్న కెనడా రచయిత్రి కార్సన్
-
Alias Rukmini: నితిన్‌ను ట్రాక్‌లోకి తెచ్చేందుకు నాని మాస్టర్ ప్లాన్.. రేపు ఉదయం 10:08కి బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్!
-
Mahindra XUV 3XO CNG: మారుతి, టాటాలకు గట్టి పోటీ.. మహీంద్రా XUV 3XO CNGని తెస్తోందా?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!