ఓ కుక్క చేసిన అద్భుత నటన అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఆ ఫన్నీ వీడియోను మీరు చూడండి. ఓ వ్యక్తి మరొక వ్యక్తిని కాల్చినప్పుడు.. ఎలా ఐతే చేస్తాడో.. అచ్చం అలాగే ఆ కుక్క కూడా చేసింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
ప్రపంచంలో మనుషులు చెప్పినట్టు వినే జంతువులు కొన్ని మాత్రమే ఉంటాయి. అందులో మనుషులతో కుక్కకు ఎక్కువగా అనుబంధం ఉంటుంది. కొందరికి కుక్కలపై ప్రేమానురాగాలు బీభత్సంగా ఉంటాయి. అంతేకాకుండా వాటిని మనుషులతో సమానంగా ప్రేమిస్తారు. ప్రపంచంలో మనుషులతో ఎక్కువగా ఉండే జంతువులలో కుక్క ఒకటి. అంతేకాకుండా కుక్కలకు ఏదైనా నేర్పిస్తే అవి త్వరగా నేర్చుకుంటాయి. ఇప్పుడు అలాంటి ఓ కుక్క వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఆ కుక్క నటనకు అందరు ఫిదా అవుతున్నారు.
Renuka Chaudhary: తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీలకు షాక్ తప్పదు..
మీరు సినిమాల్లో చూసి ఉంటారు. ఎవరైనా ఓ వ్యక్తిని కాల్చినప్పుడు.. ఆ వ్యక్తి నేలమీద పడి ఎలా చనిపోతాడో చూసూంటాం. ఈ వీడియోలో ఓ కుక్క కూడా అలానే యాక్టింగ్ చేస్తూ కనిపించింది. ఓ వ్యక్తి అతని పెంపుడు కుక్క ఎదురెదురుగా ఉన్నట్లు వీడియోలో చూడవచ్చు. ఆ వ్యక్తి తుపాకీ తీసి.. తన ముందు నిలబడి ఉన్న కుక్కపై కాల్చినట్లు.. దాని తరువాత ఆ కుక్క కూడా కాల్చబడిన విధంగా ప్రవర్తిస్తుంది. అంతేకాకుండా రెండు అడుగులు ముందుకు వేసి మూలుగుతూ నేలపై పడి చనిపోయినట్లు నటిస్తుంది. ఇంత అద్భుతంగా నటించే కుక్కలను మీరు అరుదుగా చూసి ఉంటారు.
Heavy Rains: ఉత్తరాదిని వణికిస్తున్న వర్షాలు.. పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇది ఇన్‌స్టాగ్రామ్‌లో సోలోఫానిమల్స్_ అనే ఐడితో షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు 4.8 మిలియన్ సార్లు వీక్షించారు. అంతేకాకుండా 3 లక్షల మందికి పైగా వీడియోను లైక్ చేసారు. ఈ వీడియోపై ఫన్నీ రియాక్షన్‌లు కూడా ఇచ్చారు. ‘ఈ కుక్కకి ఆస్కార్ అవార్డు రావాలి’ అని కొందరంటే, ‘ఇండియన్ టీవీ సీరియల్స్ నటీనటుల కంటే మెరుగ్గా నటిస్తుంది’ అని మరికొందరు అంటున్నారు. అదే సమయంలో కుక్క నటనను చూసి కొంతమంది వినియోగదారులు నవ్వుతున్నారు.