తెలంగాణ తెలుగుదేశం నేతలతో పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమావేశం అయ్యారు. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన నేతలతో ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబు సమావేశం అయ్యారు. సుదీర్ఘ కాలం తరువాత చంద్రబాబుతో తెలంగాణ టీడీపీ నేతలు సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుని ఎంపిక, పార్టీ సంస్థాగత నిర్మాణంపై సమావేశంలో చర్చించారు. ఇప్పటికే కసరత్తు పూర్తియిన నేపథ్యంలో తెలంగాణలో మండల అధ్యక్షుల నియామకాలు పూర్తి చేయాలని సమావేశంలో…
ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో తెలంగాణ టీడీపీ నేతలతో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అనుసరించాల్సిన విధానంపై చర్చించారు. కూటమి అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని సీఎం నేతలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ స్థానిక ఎన్నికలపైనా సీఎం చంద్రబాబు నేతలతో చర్చించినట్లు సమాచారం. ఉప ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ సహా టీడీపీ కూడా దూకుడు పెంచింది. Also Read: Vizag CP: అందుకే.. వైఎస్ జగన్…
Chandrababu Naidu: నేడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ముఖ్య నేతలతో చంద్రబాబు నాయుడు సమావేశం ముగిసింది. తెలంగాణాలో పార్టీ పునర్నిర్మాణం పై చర్చ జరిగింది., ప్రస్తుతం ఉన్న పార్టీ పదవులు అన్ని రద్దు చేసినట్లు.., రాష్ట్ర నూతన అధ్యక్ష ఎన్నికకు త్వరలో నిర్ణయం తీసుకోబోతున్నట్లు ఆయన తెలిపారు. గ్రామ స్థాయిలో సభ్యత్వాల నమోదు కార్యక్రమం చేపట్టాలని చంద్రబాబు సూశించారు. తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం తెచ్చేలా పని చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశించారు. Sheikh Hasina: షేక్…
Telangana TDP: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి అన్ని పార్టీలు సిద్ధమయ్యాయి. ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించాయి. దాదాపు పూర్తి స్థాయి కవరేజీతో బీఆర్ఎస్ తొలి జాబితాను విడుదల చేయగా, బీజేపీ 52 స్థానాలు, కాంగ్రెస్ 55 స్థానాల్లో ఉన్నాయి.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు.. రాజకీయ వ్యూహాత్మక మౌనాన్ని కొనసాగిస్తున్నారా? పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే క్రమంలో.. ఆయన సరికొత్త ఆలోచనలు చేస్తున్నారా? సరికొత్త గేమ్ ప్లాన్ తో బరిలోకి దిగబోతున్నారా? ఈ ప్రశ్నలకు.. ఆయన వ్యవహారశైలి అవుననే సమాధానం చెబుతోంది. సందర్భానుసారం మాట్లాడ్డం.. ముఖ్యమైన విషయాలపై ట్వీట్లు చేయడం తప్ప.. పెద్దగా హడావుడి చేయకుండా.. ఆయన ఎదురుచూస్తున్న తీరు సైతం.. సరికొత్త వ్యూహాలకు ఆయన పదును పెడుతున్నారన్న అభిప్రాయాన్ని కలిగిస్తోంది. తాజా పరిణామాలను విశ్లేషిస్తే.. చంద్రబాబు…
తెలంగాణ టీడీపీకి కొత్త అధ్యక్షుడిగా బక్కని నర్సింహులును ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నియమించారు. టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్. రమణ టీడీపీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్ లో చేరారు. ఈ నేపథ్యంలో ఎల్ రమణ స్థానంలో బక్కని నర్సింహులును నియమించారు చంద్రబాబు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన బక్కని నర్సింహులు… 1994-99 లో షాద్ నగర్ ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. read also : టోక్యో ఒలింపిక్స్‌లో కరోనా కలవరం ఈ…
మాజీ మంత్రి ఎల్.రమణ శుక్రవారం తెలంగాణ తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అధికార పార్టీ టీఆర్ఎస్ లో చేరుతున్నట్లుగా రమణ ప్రకటించారు. దీంతో టీ-టీడీపీ నూతన అధ్యక్షుడి ఎంపిక అనివార్యమైంది. కాగా నేడు ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ టీడీపీ నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. టీడీపీ పార్టీ తెలంగాణ శాఖకు చెందిన కోర్ కమిటీ సభ్యులు, పార్లమెంటరీ పార్టీ ఇన్ చార్జీలతో ప్రత్యేకంగా భేటీ అయిన చంద్రబాబు.. టీటీడీపీకి ఎవరిని అధ్యక్షుడిగా…
తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్. రమణ టీఆర్ఎస్ లో చేరడం దాదాపు ఖాయం అయింది. ఈరోజు సాయంత్రం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి ప్రగతి భవన్‌కు వెళ్లిన ఎల్.రమణ సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ… ‘ఎల్.రమణ అంటే కేసీఆర్‌కు అభిమానం అంటూ చెప్పుకొచ్చారు. చేనేత కుటుంబం నుంచి వచ్చిన రమణ తెరాసకు అవసరమన్నారు. రమణను తెరాసలోకి రావాలని కేసీఆర్ ఆహ్వానించారు. రమణ సానుకూలంగా స్పందించారని…
మాది కూడా ఒక పార్టీ అన్నట్టుగా ఉన్నారు ఆ శిబిరంలోని నాయకులు. పెద్దగా ప్రజల్లోకి వెళ్లిందీ లేదు. ఇంతలో పార్టీ అధ్యక్షుడే గోడ దూకేందుకు సిద్ధమయ్యారు. చెక్‌పోస్టు పడకుండానే లోడ్ ఎత్తేయడానికి రెడీగా ఉన్నారు. మరి.. ఆయన స్థానంలో వచ్చేవారు ఎవరు? ఆ దిశగా కసరత్తు మొదలైందా లేదా? తెలంగాణలో టీడీపీ బలంగా నిలబడే అవకాశం చిక్కలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఓ వెలుగు వెలిగిన పార్టీ తెలుగుదేశం. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో టీడీపీ పరిస్థితి నానాటికీ…