టీడీపీ సీనియర్ నాయకులు కుంభంపాటి రాంమోహన్ రాసిన ‘నేను.. తెలుగుదేశం’ పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయకుడు ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి వస్తే ప్రజల జీవితాల్లో మార్పు వస్తుందని నేను చెప్పా… అప్పుడు ఎన్టీఆర్ రాజకీయాలకే ఓటు వేశారని, రెండు రూపాయలకు కిలో బియ్యం ఆహార భద్రతకు దారి తీసిందన్నారు.
నాడు మేము చేసింది జాతికే ఆదర్శం అయ్యిందని, పార్లమెంటులో టీడీపీ ప్రధాన ప్రతిపక్షంగా కూడా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాహితం కోసమే పని చేశాం కానీ మళ్ళీ అధికారంలోకి రావాలని చేయలేదని, అలా చేస్తే ఎప్పుడూ అధికారంలోనే ఉండే వాళ్ళమన్నారు. చేసిన అభివృద్ధి నాకు ఆత్మ సంతృప్తి ఇస్తుందని, నేను ఐటీ గురించి అప్పుడే చెప్పా. వైఎస్ లాంటి వాళ్ళు విమర్శించారన్నారు. నాడు పెట్టిన ఐటీ కాలేజీల్లో ఇంజనీరింగ్ చేసి ప్రపంచంలోని పెద్ద పెద్ద సంస్థల్లో పని చేస్తున్నారని, పేద పిల్లల్ని ఐటీ ప్రొఫెషనల్ గా తీర్చిదిద్దింది టీడీపీ అని ఆయన గుర్తు చేశారు. ఏపీలో మళ్ళీ అధికారంలోకి రావడంమే కాదు.. ఆంద్రప్రదేశ్ ను పునర్ నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందని, టీడీపీ ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ జాతీయ భావాలు కలిగిన పార్టీ అని ఎన్టీఆర్ పార్టీ స్థాపించినప్పుడే చెప్పారన్నారు.