Ravi Teja : సెంటిమెంట్స్‌ను పట్టించుకోని రవితేజ.. చైల్డ్ సెంటిమెంట్ హిట్ తీసుకొస్తుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజా రవితేజ ఎప్పుడూ సినిమాల విషయంలో ఏలాంటి సెంటిమెంట్లనూ పట్టించుకోరు. ఫ్లాపుల్లో ఉన్న దర్శకులకు, కలిసిరాని హీరోయిన్లకు కూడా మళ్లీ అవకాశాలు ఇస్తుంటారు. అలాగే తనతో హిట్స్ ఇచ్చిన ఫామ్‌లో ఉన్న డైరెక్టర్లతోనూ కొత్త ప్రాజెక్టులు చేస్తుంటారు. ప్లాప్స్ ఎదురైనా ఏమాత్రం వెనకడుగు వేయకుండా వరుస సినిమాలతో దూసుకెళ్లడం రవితేజ నైజం.అయితే రవితేజ చాలా కాలంగా డల్ గా సాగుతోంది. 2022లో వచ్చిన ‘ధమాకా’ చిత్రం తర్వాత రవితేజ ఖాతాలో ఆ స్థాయి బిగ్గెస్ట్ హిట్ పడలేదు. ఈ క్రమంలోనే మాస్ రాజా తన తదుపరి చిత్రం ద్వారా ఎలాగైనా గట్టి కంబ్యాక్ ఇవ్వాలని భావిస్తున్నారు.
ప్రస్తుతం రవితేజ నటిస్తున్న చిత్రం ‘ఇరుముడి‘. ఈ సినిమా తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్ నేపథ్యంతో తెరకెక్కుతోంది. ఈ చిత్రం ఈ నెల 21న గ్రాండ్‌గా విడుదల కానుంది. గతంలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘విక్రమార్కుడు‘ సినిమాలో రవితేజ – పాప సెంటిమెంట్ ఏ స్థాయిలో వర్కవుట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ భావోద్వేగాలు థియేటర్లలో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. మళ్లీ చాలా కాలం తర్వాత ‘ఇరుముడి’ చిత్రంతో బలమైన తండ్రీ-కూతుళ్ల ఎమోషన్‌తో రవితేజ ముందుకు వస్తున్నారు. మరి ఈ చైల్డ్ సెంటిమెంట్ మాస్ రాజాకు మళ్లీ ఆ స్థాయి గ్రాండ్ హిట్‌ను తెచ్చిపెడుతుందో లేదో చూడాలి. తమిళ హీరోయిన్ ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటిస్తుండగా జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రీ మూవీస్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తోంది.
Also Read
- Tags
- IRUMUDI Movie
- Ravi Teja
తాజావార్తలు
-
ACB Raids : మీర్‌చౌక్ ఇన్స్పెక్టర్కు ఏసీబీ షాక్.. రూ.3 లక్షలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు
-
Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. ఇళ్లలోకి సముద్రపు నీరు, అష్టదిగ్బంధంలో అమలాపురం!
-
Venkatesh : గతంలో ప్రేమించా.. కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ జోలికొస్తే వదలను!
-
Train Accident: చెవిలో ఇయర్‌ఫోన్స్.. వెనుక రైలు.. క్షణాల్లో ప్రాణం బలి!
-
Trivikram : కుటుంబం.. ఒక పద్మవ్యూహం
ట్రెండింగ్
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!