Udhayanidhi Stalin: త్రిష పేరుతో సభలో వివాదం.. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Udhayanidhi Stalin: తమిళనాడులో కావేరీ జలాల అంశంపై జరిగిన నిరసన సభ ఇప్పుడు పూర్తిగా వేరే కారణంతో చర్చనీయాంశంగా మారింది. రాజకీయ విమర్శలతో సాగాల్సిన సభలో ప్రముఖ నటి త్రిష పేరు రావడం, ఆ తర్వాత తమిళనాడు అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఈ ఘటన రాజకీయ వర్గాల్లోనే కాకుండా సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. నిన్న కావేరీ నీటి వివాదంపై నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ ప్రసంగించారు. సభలో ఆయన ప్రసంగిస్తూ.. కావేరి నీటి సమస్యపై మన సీఎం విజయ్ నోరు విప్పడం లేదు, ఆయనకు కేవలం DMKపై తప్పుడు కేసులు పెట్టడమే ముఖ్యం అని విమర్శిస్తుండగా, సభలోని కొందరు ‘త్రిష, త్రిష’ అని గట్టిగా అరిచారు. దానికి ఉదయనిధి నవ్వుతూ ‘ఏ నీళ్లు వచ్చినా రాకపోయినా, ఆ నీళ్లు మాత్రం రావాలి’ అని డబుల్ మీనింగ్ వచ్చేలా వ్యాఖ్యానించారు. ఆ వెంటనే కాసేపు ఆగి, మళ్లీ నవ్వుతూ నేను అన్నది కావేరి నీళ్ల గురించని కవర్ చేసే ప్రయత్నం చేశారు.
ఆతర్వాత ఉదయనిధి స్టాలిన్ చిరునవ్వుతో స్పందిస్తూ చేసిన వ్యాఖ్య డబుల్ మీనింగ్ వచ్చేలా ఉందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. రాజకీయ సభలో అలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సమంజసం కాదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా నటి త్రిష పేరును ఈ తరహాలో ప్రస్తావించడం మహిళల పట్ల అవమానకరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై తమిళనాడు బీజేపీ తీవ్రంగా స్పందించింది. పార్టీ అధికార ప్రతినిధి నారాయణన్ తిరుపతి సోషల్ మీడియా వేదికగా ఉదయనిధిపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన వ్యాఖ్యలను అసహ్యకరమైనవి, అశ్లీలమైనవి, సిగ్గుచేటైనవిగా అభివర్ణించారు. కుటుంబ విలువలు తెలిసిన ఎవరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయరని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా ఈ వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా బీజేపీ డిమాండ్ చేసింది. ఉదయనిధి స్టాలిన్ను అరెస్టు చేసి చట్టపరంగా విచారించాలని నారాయణన్ తిరుపతి పేర్కొన్నారు.
Also Read
ప్రస్తుతం ఈ ఘటన తమిళనాడు రాజకీయాల్లో వాడి వేడి చర్చకు తెరతీసింది. ఒకవైపు డీఎంకే నుంచి అధికారిక స్పందన కోసం ఎదురుచూస్తుండగా, మరోవైపు సోషల్ మీడియాలో ఉదయనిధి వ్యాఖ్యలపై అనుకూల, ప్రతికూల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ సభల్లో ఉపయోగించే భాష, ప్రజా ప్రతినిధుల బాధ్యత, మహిళల పట్ల గౌరవం వంటి అంశాలపై మరోసారి చర్చ మొదలైంది. ఈ వివాదం రాబోయే రోజుల్లో మరింత రాజకీయ వేడిని పెంచే అవకాశం కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్లో సంచలన విషయాలు.!
-
Realme P4s Lite 4G: రూ.16,499కే 7,000mAh బ్యాటరీతో Realme P4s భారత్ లో లాంచ్.. 120Hz డిస్ప్లే, 13MP కెమెరా!
-
Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
-
Astrology: అక్టోబర్ 06 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అంతా మంగళదాయకమే..
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!