తమిళనాడు రాజధాని చెన్నైలో సీబీఐ మెరుపు దాడులు చేస్తోంది. పలుచోట్ల ఒకేసారి సీబీఐ అధికారులు తనిఖీలు చేపట్టారు. దీంతో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. రూ.5,832 కోట్ల విలువైన బీచ్ ఇసుక తవ్వకాల కుంభకోణం కేసులో ప్రముఖ వ్యాపారవేత్త ఇంట్లో సహా తమిళనాడు వ్యాప్తంగా 18 చోట్ల సీబీఐ దాడులు చేపట్టింది.
ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపేశ్ బఘేల్ నివాసానికి కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారులు చేరుకున్నారు. ఆయన ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏజెన్సీ బృందాలు రాయ్‌పూర్, భిలాయ్‌లోని బాఘేల్ నివాసంతో పాటు ఓ సీనియర్ పోలీసు అధికారి, మాజీ ముఖ్యమంత్రి సన్నిహితుడి ఇంట్లో కూడా రైడ్స్ జరుపుతున్నారు. భూపేశ్ బాఘేల్ తో పాటు, సీబీఐ అధికారులు ఆయన సన్నిహితులు వినోద్ వర్మ, దేవేంద్ర యాదవ్ నివాసానికి కూడా చేరుకున్నారని వర్గాలు తెలిపాయి.
ఉత్తరప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. సీబీఐ రైడ్స్‌కు భయపడి పోస్టాఫీస్ ఆఫీసర్ త్రిభువన్ ప్రతాప్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇంట్లో లైసెన్స్ పిస్టల్‌తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ సందర్భంగా రాసిన సూసైడ్ నోట్ వైరల్ అవుతోంది.
ఒకటి, రెండు రోజుల వయస్సులోపు శిశువుల అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా సీబీఐ బట్టబయలు చేసింది. ఢిల్లీ, హర్యానాలో జరిపిన దాడుల్లో 1.5 రోజులు, 15 రోజులు, ఒక నెల వయసున్న ముగ్గురు శిశువులను సీబీఐ ముఠా బారి నుంచి రక్షించింది. వీరిలో ఇద్దరు మగ శిశువులు, ఒక నెల వయసున్న ఆడ శిశువు ఉన్నారు.
Paytm : ఫిన్‌టెక్ కంపెనీ Paytm సమస్యలు ఇప్పట్లో సమసిపోయే సూచనలు కనిపించడం లేదు. Paytmకి రిజర్వ్ బ్యాంక్ 15 రోజుల సమయం ఇచ్చినప్పటికీ, ED పట్టు కంపెనీపై కొనసాగుతోంది.
ఢిల్లీ సెక్రటేరియట్‌లో సీబీఐ సోదాలు నిర్వహించింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సోదాలు నిర్వహిస్తోంది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా నివాసం, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు చేపట్టింది.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో సీబీఐ సోదాలు మరోసారి హాట్ టాపిగ్గా మారాయి. జేసీ ఫ్యామిలీ.. బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4గా అక్రమంగా విక్రయించిందన్న ఆరోపణలపై ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ బృందం.. పలు ప్రాంతాల్లో దాడులు చేసింది. మాజీమంత్రి జేసీ దివాకర్‌రెడ్డి ముఖ్య అనుచరుడు చవ్వా గోపాల్‌రెడ్డికి చెందిన జఠధార ఇండస్ట్రీస్ కార్యాలయంతో పాటు, ఆయన ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. కీలకమ్తెన డాక్యుమెంట్ల కోసం వెతికినట్లు సమాచారం. నిన్న రాత్రి వరకు సోదాలు కొనసాగాయి. Read…
కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ నివాసంలో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వచ్చిన ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
CBI raids in child pornography case: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టికేషన్(సీబీఐ) దేశవ్యాప్తంగా భారీగా దాడులు చేసింది. పిల్లల లైంగిక దోపిడికి సంబంధించిన కేసులో 19 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 56 ప్రదేశాలపై దాడులు చేశారు. పిల్లలకు సంబంధించిన లైంగిక మెటీరియర్ ను సర్య్కులేట్ చేస్తున్న ముఠాల ఆటకట్టించేందుకు సీబీఐ పెద్ద ఎత్తున రంగంలోకి దిగింది. న్యూజిలాంట్ లోని ఇంటర్‌పోల్ యూనిట్ సింగపూర్ ద్వారా ఇచ్చిన సమాచారం మేరకు పెద్ద ఎత్తున సీబీఐ అధికారులు…