ఇవాళ సాయంత్రం ఖమ్మంలో జరిగే జనగర్జన సభను ఫెయిల్ చేయాలని అధికార పార్టీ తెగ ప్రయత్నాలు చేస్తోంది అని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ పాల్గొంటున్నందున సభను నిర్వహించనివ్వద్దని కుట్రలు చేస్తోందని ఆయన ఆరోపించారు.
తెలంగాణలో ఖమ్మం వేదికగా కాంగ్రెస్ పార్టీ నేడు జనగర్జన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ బహిరంగ సభకు హాజరుకానున్నారు. సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీలో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరనున్నారు.