KTR-Harish Rao: కవితను కలిసేందుకు ఢిల్లీకి కేటీఆర్, హరీష్ రావు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR-Harish Rao: ఇవాళ కవితను కలిసేందుకు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ లిక్కర్ సామ్ లో అరెస్ట్ అయిన కవితను ఇవాళ ఆదివారం సాయంత్రం కోర్టు నిర్దేశించిన సమయంలో కేటీఆర్, హరీష్ రావులు కలిసే అవకాశం ఉందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఈడీ కస్టడీలో ఉన్న కవితను కలిసేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు సమయం కేటాయించింది. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్య కవితను కలిసేందుకు అవకాశం కల్పించింది. ఈనేపథ్యంలో భర్త అనిల్, సోదరుడు కేటీఆర్ తో సహా హరీష్ రావు, ప్రణీత్, న్యాయవాదులు కలిసే అవకాశాలు వున్నాయి. కాగా.. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు. తాజాగా ఈడీ ఆమె భర్త అనిల్‌కు నోటీసులు పంపింది. సోమవారం ఢిల్లీలోని తమ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొంది. కవిత భర్త అనిల్, ఆమె పీఆర్వో రాజేష్ మరో ముగ్గురు సిబ్బందికి నోటీసులు జారీ చేశారు.
Read also: Janvikapoor : స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్న దేవర బ్యూటీ..
Also Read
- The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
- Hyderabad: రూట్ మార్చి నిర్మానుష్య ప్రాంతానికి.. మహిళపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నం..
- BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
- South Central Railway : మౌలాలిలో రైళ్లకు బ్రేక్.. డీజిల్ ఇంజిన్లతో రంగంలోకి రైల్వే.!
ఈ కేసులో భాగంగా ఇప్పటికే ఈడీ అధికారులు నాలుగు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణలో కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ పేరు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి ఆడుతున్న నాటకమని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు లబ్ధి పొందేందుకు తమ పార్టీ నాయకురాలు కవితపై తప్పుడు కేసులు బనాయించి, కేసులు పెట్టి, అరెస్టు చేశారని నిప్పులు చెరిగారు. ఎన్నికల ముందు కవితను అరెస్ట్ చేయడంలో అంతరార్థం ఏమిటో తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలను ప్రజా కోర్టులో శిక్షిస్తామని హెచ్చరించారు. కేసీఆర్ పేరును చెడగొట్టేందుకు రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. గతంలో తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందని గుర్తు చేశారు. కవిత అరెస్ట్‌కు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా శనివారం నిరసనలు చేపట్టాలని బీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో నేడు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు.
Dhanashree Verma: మీ అభిప్రాయాలను వ్యక్తం చేసేముందు.. మనుషులుగా ఆలోచించండి! చహల్ సతీమణి ఫైర్
తాజావార్తలు
-
Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
-
Work From Home: ఉద్యోగులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి వర్క్ ఫ్రం హోం..
-
Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
-
BCCI: అతడు కెప్టెన్ అయ్యాకే అంతా మారింది.. బీసీసీఐ మైండ్ బ్లాక్ డెసిషన్.. పాక్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
-
Canara Bank Recruitment 2026-27: 3,500 పోస్టులు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!