Dhanashree Verma: మీ అభిప్రాయాలను వ్యక్తం చేసేముందు.. మనుషులుగా ఆలోచించండి! చహల్ సతీమణి ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhanashree Verma React on Viral Photo with Pratik Utekar: భారత క్రికెటర్ యుజ్వేంద్ర చహల్ సతీమణి ధనశ్రీ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ధనశ్రీ కొరియోగ్రాఫర్ మాత్రమే కాదు.. ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా నడుపుతున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె.. తన భర్త చహల్‌తో కలిసి వీడియోలు, రీల్స్ చేస్తుంటారు. తాజాగా హిందీ పాపులర్ డ్యాన్స్ షో ‘జలక్ దికలాజా’లో కంటెస్టెంట్‌గా బరిలోకి దిగారు. ఫైనల్‌లో కొరియోగ్రాఫర్ ప్రతీక్ ఉతేకర్‌తో ధనశ్రీ అత్యంత సన్నిహతంగా ఉన్న ఫొటో ఒకటి వైరల్‌గా మారింది. దీంతో ఆమెను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేశారు.
తాజాగా ట్రోల్స్‌పై స్పందించిన ధనశ్రీ వర్మ ఓ ఇన్‌స్టాగ్రామ్ వీడియో విడుదల చేశారు. అభిప్రాయాలను వ్యక్తం చేసేముందు మనుషులుగా ఆలోచించండి అని ఫైర్ అయ్యారు. ‘ఏదైనా అడగడం చాలా సులువు. మీ అభిప్రాయాలను వ్యక్తం చేసేముందు మనుషులగా ఆలోచించండి. నేను నా జీవితంలో ఎప్పుడూ ట్రోల్స్, మీమ్‌ల బారిన పడలేదు. నేను వాటిని పట్టించుకోను. కొన్నిసార్లు వాటిని చూసి నవ్వుకుంటాను. అయితే ఇప్పుడు ఈ చెత్త ట్రోల్స్‌పై స్పందించాల్సి వచ్చింది. ఎందుకంటే అవి నా కుటుంబం, సన్నిహితులను తీవ్రంగా ప్రభావితం చేశాయి’ అని ధనశ్రీ అన్నారు.
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
Also Read: IPL 2024: ఐపీఎల్ ఎక్కడికీ పోదు.. పూర్తిగా భారత్‌లోనే!
‘మీ అందరికీ సోషల్ మీడియాలో అభిప్రాయాలను వ్యక్తపరిచే స్వేచ్ఛ ఉంది. కానీ ఇతరుల వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేసి.. మనోభావాలను దెబ్బతీయడం సరికాదు. నా పనిలో సోషల్ మీడియా భాగం కాబట్టి నేను దాన్ని విడిచిపెట్టలేను. ఇన్‌స్టాగ్రామ్‌లోకి తిరిగి రావడానికి నేను ఈరోజు ధైర్యాన్ని కూడగట్టుకున్నాను. మిమ్మల్ని అలరించడానికే సోషల్ మీడియాలో ఉన్నాము. మీ అమ్మ, మీ సోదరి, మీ స్నేహితురాలు, మీ భార్య లాగే నేను కూడా ఒక స్త్రీని అనే విషయాన్ని మర్చిపోకండి. నేను ఓ పోరాట యోధురాలిని. ఏ విషయానికి వెనకడుగు వేయను. మంచి విషయాలపై దృష్టి పెట్టి.. మీ జీవితంలో ముందుకు సాగాలని ఆశిస్తున్నా’ అని ధనశ్రీ వర్మ చెప్పుకోచ్చారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?