సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోఆరెకటిక సంఘం నూతన భవనానికి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ప్రభుత్వ ఆసుత్రుల్లో కార్పొరేట్ స్థాయి వసతులు కల్పించి మెరుగైన వైద్యం అందిస్తున్నామని మంత్రి హరీష్ రావు చెప్పారు.
Festival of Ponds: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకల్లో భాగంగా ప్రత్యేకంగా చెరువుల పండుగను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే నేడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో చెరువుల పండుగ నిర్వహించనున్నారు.
మిషన్ కాకతీయ హైదరాబాద్ లో ఏమైంది? ప్రశ్నించారు బిజెపి నేత Nvss ప్రభాకర్. భారీ వర్షాలతో నగరంలో భారీ నష్టం జరిగిందని మండిపడ్డారు. పలు కాలనీలు నీట మునిగాయని ఆగ్రహం వ్యక్తం చేసారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుండి రాష్ట్ర పురపాలక మంత్రులుగా కెసిఆర్, కేటీఆర్ లే పని చేశారని గుర్తు చేసారు. హైదరాబాద్ దుస్థితికి కారణం తండ్రి కొడుకులే.. వారే నైతిక బాధ్యత వహించాలని మండిపడ్డారు. చెరువుల ఆక్రమణ వల్లే ఈ సమస్య ఏర్పడిందని నిప్పులుచెరిగారు.…
రాబోయే రోజుల్లో నీటికొరతను నివారించేందుకు, భవిష్యత్ తరాల కోసం నదుల్ని పరిరక్షించాల్సిన అవసరం వుందన్నారు మంత్రి హరీష్ రావు. నదుల పరిరక్షణ, నదుల పునరుద్ధరణ పైనే సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారు. మిషన్ కాకతీయను ప్రజలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్తున్నారు. మిషన్ కాకతీయతో పడ్డ ప్రతి వర్షపు చుక్కను ఒడిసిపట్టి ఆయకట్టు పెంచుకున్నాం. రాష్ట్రంలో 46 వేల చెరువులను పునరుద్ధరించుకున్నాం.కుంభవర్షాలు పడ్డా ఎక్కడా చెరువులు తెగలేదు. భూగర్భజలాలు పెరిగాయి.4వేల చెక్ డ్యామ్ లను 6వేల కోట్లతో నిర్మించుకున్నాం.…