Bandi Sanjay Letter To CM KCR About Govt Employees Problems: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు. విద్యుత్ శాఖలో పని చేస్తున్న ఆర్టిజన్లు, ఉద్యోగుల సమస్యల్ని వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టాల్సిందిగా ఆ లేఖలో డిమాండ్ చేశారు. తమ సమస్యల్ని పరిష్కరించమంటూ ఆర్టిజన్లు, ఉద్యోగులు అనేక నెలల నుంచి ఆందోళన చేస్తున్నారని.. దాదాపు 23వేల మందికి పైగా ఉన్న వారి సమస్యల పట్ల ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం గర్హనీయమని అన్నారు. వారి పట్ల విద్యుత్ శాఖ యాజమాన్యం, రాష్ట్ర సర్కార్ కనీసం శ్రద్ధ చూపకపోవడం.. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల మీ ప్రభుత్వ వ్యతిరేక వైఖరిని కనబరుస్తోందని మండిపడ్డారు.
Baba sitting on a Hot Griddle: వేడివేడి పెనంపై కూర్చొని భక్తులకు బాబా ఆశీర్వాదం
జీపీఎఫ్, పీఆర్‌సీ వంటి సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని బండి సంజయ్ పేర్కొన్నారు. 1999 నుండి 2004 మధ్యకాలంలో విద్యుత్ సంస్థల్లో నియమితులైన వారికి జీపీఎఫ్ సౌకర్యం కల్పించాలని, ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్‌లు న్యాయబద్ధమైనవని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో విద్యుత్ శాఖ ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని.. అనేక సమస్యలు, ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యమంలో వాళ్లు చురుకుగా పాల్గొన్నారని చెప్పారు. ప్రభుత్వ పాలనలో విద్యుత్ శాఖ అత్యంత కీలకమైనదిగా అభివర్ణించారు. ఒకవేళ ఆర్టిజన్లు, విద్యుత్ ఉద్యోగులు సమ్మెలోకి దిగితే.. మొత్తం పాలనా యంత్రాంగమే కుప్పకూలుతుందని హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి మొదటి నుండీ చిన్నచూపే ఉందని విమర్శించారు.
Mega Power: రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా ‘మెగా పవర్’ ఫస్ట్ లుక్ విడుదల!
ప్రభుత్వ ఉద్యోగులకు, ఆర్టీసీ కార్మికులకు ఇవ్వాల్సిన డిఏ బకాయిలు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయని బండి సంజయ్ ఆరోపించారు. కొత్త పీఆర్‌సీ గురించి ప్రభుత్వం కనీసం స్పందించడం లేదన్నారు. దేశంలోనే మెరుగైన వైద్య సదుపాయం అందిస్తున్నట్లు గొప్పలు చెప్పుకొనే రాష్ట్ర ప్రభుత్వం.. ఉద్యోగులు కోరుతున్న నగదు రహిత మెడికల్ పాలసీ విషయంలో ఎందుకు వెనకాడుతుందని ప్రశ్నించారు. పదవీ విరమణ సహా ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఇన్సెంటీవ్‌లు, పీఆర్‌సీ, జీపీఎఫ్ వంటి సమస్యల విషయంలో ప్రభుత్వం వెంటనే ఉద్యోగులు, ఆర్టిజన్లతో చర్చలు జరపాలని బీజేపీ డిమాండ్ చేస్తోందన్నారు. ఒకవేళ ఈ సమస్యల్ని పరష్కరించకపోతే.. తెలంగాణ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వంపై తిరగబడే రోజులు వస్తాయని హెచ్చరించారు.