Chiranjeevi – Tamilisai: 50 సార్లకు పైగా రక్తదానం చేసిన వారికి చిరు భద్రతా కార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Blood Donors Honourned In Raj Bhavan By Chiranjeevi and Tamilisai: చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో 50 సార్లకు పైగా రక్తదానం చేసిన రక్తదాతలకు రాజ్‌భవన్ వేదికగా మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ‘చిరు భద్రతా కార్డు’లను గవర్నర్ తమిళిసై అందజేశారు. రక్తదాతలను సత్కరించి.. లైఫ్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రక్తదాతలపై గవర్నర్, చిరంజీవి ప్రశంసలు కురిపించారు. చిరు మాట్లాడుతూ.. 1998లో తాను బ్లడ్ బ్యాంక్ ప్రారంభించానని, దాని వెనుక ఎంతో కృషి ఉందని అన్నారు. ఆ రోజుల్లో రక్తం కొరత చాలా ఎక్కువగా ఉండేదని, రక్తదానం చేసే వాళ్లు తక్కువ మందే ఉండేవారన్నారు. అప్పుడు తనకు బ్లడ్ బ్యాంక్ ఎందుకు ప్రారంభించకూడదన్న ఆలోచన వచ్చిందని, అందుకు తన ఫ్యాన్స్ కూడా సహకరించారని చెప్పారు. ఫ్యాన్స్‌గా నా సినిమాలు చూడటం, నన్ను కలవడం, ఫోటోలు దిగడం కంటే.. రక్తదానం చేయడమే తనకు ఎక్కువ సంతోషాన్నిస్తుందని తెలిపారు. రక్తదానం చేస్తున్న ప్రతీ అభిమానికి చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. ఇక కరోనా సమయంలో కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) ప్రారంభించినప్పుడు, సినీ కార్మికులకు సరుకులు అందిస్తున్నప్పుడు, తనని ప్రోత్సాహించిన మొదటి వ్యక్తి గవర్నర్ అని చిరంజీవి పేర్కొన్నారు. గవర్నర్ ఎన్నోసార్లు ట్వీట్ చేసి, ఎంకరేజ్ చేశారన్నారు.
అనంతరం గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ.. రక్తదానం ప్రాముఖ్యతను వివరించారు. తాను హౌజ్ సర్జన్‌గా ఉన్నప్పుడు, తమ కుటుంబంలోనే ఒకరికి రక్తం అత్యవసరమైందని.. ఆ టైంలో పేషెంట్‌ని చూసేందుకు చాలామంది వచ్చారని అన్నారు. అప్పుడు ఆ పేషెంట్‌కి రక్తం కావాలన్నానని, ఎవరైనా దానం చేస్తారా అని అడిగానని, అలా అడిగే సరికి అందరూ అక్కడి నుంచి జారుకున్నారని వెల్లడించారు. రక్తదానం అంత సులువు కాదని, ఒక డాక్టర్‌గా తాను ఎన్నో సంఘటనలు చూశానని పేర్కొన్నారు. రక్తం దొరక్క చనిపోయిన పేషెంట్స్‌ని చూశానని, రక్తం దొరకడం వల్ల ప్రాణాలతో బయటపడిన వాళ్లనూ చూశానని తమిళిసై చెప్పుకొచ్చారు.
Also Read
- Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
- Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!