Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
- FBI డైరెక్టర్ కాష్ పటేల్ పెళ్లికి రెడీ
- కాబోయే భార్య అలెక్సిస్ విల్కిన్స్ ఎవరో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kash Patel Engaged: అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) డైరెక్టర్ కాష్ పటేల్ తన చిరకాల ప్రియురాలు, కంట్రీ సింగర్, రాజకీయ వ్యాఖ్యాత అలెక్సిస్ విల్కిన్స్ తో నిశ్చితార్థం చేసుకున్నారు. కొంతకాలంగా కొనసాగుతున్న వీరి సంబంధాన్ని తాజాగా ఇద్దరూ అధికారికంగా వెల్లడించారు. దీంతో ఈ హై-ప్రొఫైల్ జంటపై మరోసారి చర్చ మొదలైంది. అలెక్సిస్ విల్కిన్స్ ఆదివారం సాయంత్రం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో కాష్ పటేల్‌తో కలిసి ఉన్న నలుపు-తెలుపు ఫొటోను షేర్ చేశారు. ఈ ఫొటోలో ఆమె తన ఎంగేజ్మెంట్ రింగ్‌ను ప్రదర్శించారు. దీనికి ఆమె “Went and got the law involved” అంటూ సరదాగా క్యాప్షన్ ఇచ్చారు. అనంతరం కాష్ పటేల్ కూడా ఆమె పోస్టును రీపోస్ట్ చేశారు.
2022లో తొలిసారి పరిచయం.. 2023 నుంచి డేటింగ్
కాష్ పటేల్, అలెక్సిస్ విల్కిన్స్ కొంతకాలంగా రిలేషన్షిప్లో ఉన్నట్లు తెలుస్తోంది. పటేల్ FBI డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టడానికి ముందే వీరి సంబంధం ప్రారంభమైంది. తాజా నివేదికల ప్రకారం, వీరిద్దరూ 2022లో నాష్‌విల్లేలో జరిగిన ఓ కార్యక్రమంలో తొలిసారి కలుసుకున్నారు. అనంతరం 2023లో డేటింగ్ ప్రారంభించినట్లు సమాచారం. 2025లో కాష్ పటేల్ FBI డైరెక్టర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమానికి కూడా విల్కిన్స్ హాజరయ్యారు. అప్పటి నుంచి ఈ జంటకు సంబంధించిన ఫొటోలు, పబ్లిక్ ఈవెంట్లలో వీరి హాజరు తరచుగా వార్తల్లో నిలిచాయి.
Also Read
- Bangladesh: బంగ్లాదేశ్‌లో మళ్లీ అరాచకం.. హసీనా రాకముందే బాంబు దాడులు, ఆందోళనలు!
- North Korea: అమెరికా దెబ్బకు వణికిపోతున్న కిమ్.. 54 ఏళ్ల తర్వాత రాజ్యాంగం మార్చి సంచలన నిర్ణయం!
- Donald Trump: ఇరాన్‌పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. 93 శాతం కాదు, 100 శాతం విజయం సాధిస్తాం!
- Pakistan Terror Attack: పాకిస్థాన్‌లో ఘోర ఉగ్రదాడి.. DSP, సబ్ ఇన్స్పెక్టర్ సహా 10 మంది పోలీసుల మృతి
అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
అలెక్సిస్ విల్కిన్స్ అమెరికన్ కంట్రీ మ్యూజిక్ సింగర్‌తో పాటు రాజకీయ వ్యాఖ్యాతగా కూడా గుర్తింపు పొందారు. ఆమె తన తొలి మ్యూజిక్ ప్రాజెక్ట్‌ను 2023లో విడుదల చేశారు. కంట్రీ మ్యూజిక్‌తో పాటు సంప్రదాయవాద భావజాలానికి సంబంధించిన సంస్థలు, రాజకీయ కార్యక్రమాలతో కూడా విల్కిన్స్కు అనుబంధం ఉంది. తన వెబ్సైట్లో ఆమె తన సంగీత శైలిని కంట్రీ మ్యూజిక్ సంప్రదాయాలను గౌరవిస్తూ, సమకాలీన అంశాలు, ప్రస్తుత వ్యాఖ్యానాలను జోడించే విధంగా ఉంటుందని వివరించారు. అమెరికా రాజకీయాలకు సంబంధించిన పలు కార్యక్రమాల్లో కూడా ఆమె పాల్గొన్నారు.
ఇప్పుడు ఎంగేజ్మెంట్తో మరోసారి వార్తల్లోకి
కాష్ పటేల్ FBI డైరెక్టర్‌గా అత్యంత కీలకమైన ప్రభుత్వ బాధ్యతల్లో ఉండగా, అలెక్సిస్ విల్కిన్స్ కంట్రీ మ్యూజిక్‌తో పాటు రాజకీయ వ్యాఖ్యాతగా కొనసాగుతున్నారు. ఇద్దరూ తమ తమ రంగాల్లో పబ్లిక్ ఫిగర్లుగా ఉండటంతో వీరి వ్యక్తిగత జీవితం కూడా తరచుగా ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా ఎంగేజ్మెంట్ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించడంతో ఈ హై-ప్రొఫైల్ జంట మరోసారి వార్తల్లో నిలిచింది.
Went and got the law involved 💍❤️ @Kash_Patel https://t.co/OjZmOOrVg7
— Alexis Wilkins (@AlexisWilkins) October 4, 2026
తాజావార్తలు
-
Jithu Madhavan: ఆ స్వీకెల్ ఇప్పట్లో లేనట్లేనా? తేల్చి చెప్పేసిన డైరెక్టర్!
-
Robbery: తనిష్క్లో భారీ చోరీ.. రూ.50 కోట్ల విలువైన నగలు అపహరణ..
-
KTM X-Bow Arrow: KTM నుంచి కొత్త ఆఫ్‌రోడ్ వాహనం.. 500 యూనిట్లే, ధర రూ.92.4 లక్షలు
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో మళ్లీ అరాచకం.. హసీనా రాకముందే బాంబు దాడులు, ఆందోళనలు!
-
Big Rain Alert: బంగాళాఖాతంలో మరో తుఫాన్ ముప్పు.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!