ఈజీ మనీకోసం అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. క్షుద్రపూజల పేరుతో హడావిడి చేస్తున్నారు.. దేవాలయాలు, పురాతన భవనాల్లో తవ్వకాలు సాగిస్తున్నారు. ఇప్పుడు స్కూళ్లను కూడా వదలడం లేదు. తాజాగా హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో క్షుద్రపూజలు జరగడం కలకలం రేపుతోంది. రాజేంద్రనగర్ హైదర్ షాకోట్ స్కూల్ లో ఈ క్షుద్ర పూజలు జరిగినట్టు తెలుస్తోంది. స్కూల్ సైన్స్ లాబ్ తో పాటు స్టోర్ రూమ్ ప్రాంతాల్లో పూజలు నిర్వహించారు గుర్తుతెలియని వ్యక్తులు. ఈ క్షుద్రపూజల నేపథ్యంలో భయాందోళనలకు గురవుతున్నారు స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు. స్కూల్లోని సీసీ కెమేరాలు మాయమవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు ఈ క్షుద్రపూజలు చేసిందెవరు? దీనికి వెనుక ఎవరున్నారు అనేది దర్యాప్తులో తేలనుంది.
ఇలాంటి క్షుద్రపూజలు దేశవ్యాప్తంగా జరుగుతూనే వున్నాయి. మహారాష్ట్రలో ఇలాంటి ఘటనే ఇటీవల వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. కోట్లు సంపాదించాలంటే మూఢనమ్మకాల మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఒంటిపై దుస్తులు లేకుండా నగ్నంగా క్షుద్రపూజలు చేయాల్సి ఉంటుందంటూ బాలికను బలవంత పెట్టారు. ఇలాంటి ఘటనలు చట్టరీత్యా నేరం. అలాంటి వారిపై పోక్సో సహా పలు చట్టాల కింద కేసు నమోదు చేయవచ్చు.
Read Also: Andhra Pradesh: ఓడీ దాటుతున్నారు జాగ్రత్త.. ఏపీ సర్కారుకు RBI హెచ్చరిక
మహారాష్ట్రలో అదే జరిగింది. క్షుద్రపూజలు చేస్తే.. కనకవర్షం కురుస్తుందని నమ్మించారు.తాము చెప్పినట్లు క్షుద్రపూజలు చేస్తే కోటీశ్వరురాలివి అవుతావని ఆశపెట్టారు. దీనికోసం కొన్ని పూజలు చేయాల్సి ఉంటుందని సూచించారు. దీనికి అంగీకరించిన ఆ బాలిక క్షుద్రపూజలు చేయడానికి అంగీకరించారు. ఎక్కడో చోట ఏదో విధంగా ఈజీ మనీ పేరుతో ఇలాంటివి జరుగుతూనే వున్నాయి. గ్రామాల్లో ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో పాడుబడిన భవనాల దగ్గర తవ్వకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. లంకె బిందెలు వుంటాయని, మీరు రాత్రికి రాత్రి కోటీశ్వరులు అవుతారని నమ్మబలుకుతున్నారు. మంత్రాలు, నిమ్మకాయలు, కుంకుమ, పసుపు, వివిధ రకాల వస్తువులు, అస్తిపంజరాలు లభిస్తున్నాయి. రోడ్ల మీద నిమ్మకాలు దిష్టి తీసి పడేయడంతో అటుగా వెళ్ళేవారు ఆందోళనకు గురవుతున్నారు. ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తగా వుండాలని, క్షుద్రపూజలు చేస్తే ఎలాంటి సంపద రాదంటున్నారు శాస్త్రవేత్తలు., సామాజికవేత్తలు.
Read Also: Top Headlines @9AM: టాప్ న్యూస్