దళితబంధు మాదిరి గిరిజనబంధు అమలు చేయాలి అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఎన్నికల్లో ప్రజలను వంచించటానికి సీఎం కేసీఆర్ దొంగ స్కీంలను తీసుకొచ్చాడు. నవంబర్ 4న దళితబంధు అమలు చేస్తామన్న కేసీఆర్ మాటలు ఒట్టి మాటలు. రిజర్వేషన్లను అడ్డుకుని గిరిజనుల కళ్ళల్లో మట్టికొట్టిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని తెలిపారు. మూడెకరాల భూమి దేవుడెరుగు.. సాగుచేసుకుంటోన్న పోడు భూములను లాక్కుంటున్నాడు. ధరణి పోర్టల్ వలన సొంత భూముల మీద హక్కులు కోల్పోతున్నాం. సమాజంలో అత్యంత వెనుకబడిన వారు హరిజనులు, గిరిజనులు. కేసీఆర్ మాటలు గొప్పగా ఉంటాయి…. అచరణకు మాత్రం నోచుకోవు. తెలంగాణ వస్తే గిరిజనులకు రిజర్వేషన్లు ఇస్తామని కేసీఆర్ హామీ ఏమైంది అని ప్రశ్నించారు. గిరిజన విద్యార్థులకు పాత బకాయిలు, మెస్ ఛార్జీలు వెంటనే రిలీజ్ చేయాలి. ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారో కేసీఆర్ చెప్పాలి అని పేర్కొన్నారు.