Peddi Sudarshan Reddy: పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక లేరు.. చికిత్స పొందుతూ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Peddi Sudarshan Reddy: బీఆర్ఎస్లో తీవ్ర విషాదం నెలకొంది. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. గత వారం రోజులుగా తీవ్రమైన అనారోగ్యంతో సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన, పరిస్థితి విషమించడంతో తెల్లవారుజామున 12:51 గంటలకు కన్నుమూసినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వారం రోజుల క్రితం పెద్ది సుదర్శన్ రెడ్డికి ఒక్కసారిగా గుండెపోటు రావడంతో వరంగల్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో సీపీఆర్ (CPR) చేస్తూ హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు. అయితే, సీపీఆర్ చేస్తున్న సమయంలోనే ఆయన బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు వెల్లడించారు. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో వెంటిలేటర్‌పై చికిత్స అదించారు. అయినా లాభం లేకుండా పోయింది. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆకస్మిక మరణ వార్త తెలిసిన వెంటనే నర్సంపేట నియోజకవర్గంలోని అభిమానులు, కార్యకర్తలు, నాయకులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలియజేస్తున్నారు.
సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి నుంచి ఉదయం సూదర్శన్రెడ్డి భౌతికకాయాన్ని నర్సంపేటకు తరలించారు. దుగ్గొండి మండలం గిర్ని బావి నుంచి ర్యాలీగా భౌతికకాయాన్ని తరలించారు. నర్సంపేట నియోజకవర్గ కేంద్రంలో అశేష జనవాహిని సందర్శనార్థం భౌతికకాయాన్ని ఉంచారు. నర్సంపేట నియోజకవర్గం నుంచి భారీ జనవాహిని అశ్రునయనాలతో భౌతికకాయాన్ని ముతోజిపేట ఇటుకలపల్లి గుండ్లపాడు రుద్రగూడెం మీదుగా నల్లబెల్లికి తరలించనున్నారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగ్రామం నల్లబెల్లిలో సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది.
Also Read
- Putin: బ్రిక్స్‌కు ముందే ఢిల్లీకి వస్తున్న పుతిన్.. కారణమిదే!
- PM Modi: మోడీ ముంబై టూర్లో కలకలం.. ఇద్దరు అనుమానితుల నుంచి నకిలీ ID, తుపాకీ స్వాధీనం!
- Supreme Court: ‘మా మనసులో ఒక ఆలోచన ఉంది’.. హాస్టళ్ల భద్రతపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- UN Map Controversy: వరల్డ్ మ్యాప్ వివాదం.. భారత్‌కు బయట అరుణాచల్, అక్సాయ్ చిన్!
తాజావార్తలు
-
Harish Rao : 1000 రోజులు.. హామీలు ఎక్కడ? హరీశ్ రావు బిగ్ కౌంటర్!
-
Putin: బ్రిక్స్‌కు ముందే ఢిల్లీకి వస్తున్న పుతిన్.. కారణమిదే!
-
Tollywood vs Kollywood: తెలుగు గడ్డపై తమిళ హీరోల జోరు.. మరి కోలీవుడ్‌లో తెలుగు సినిమాల పరిస్థితి దారుణమా?
-
PM Modi: మోడీ ముంబై టూర్లో కలకలం.. ఇద్దరు అనుమానితుల నుంచి నకిలీ ID, తుపాకీ స్వాధీనం!
-
Supreme Court: ‘మా మనసులో ఒక ఆలోచన ఉంది’.. హాస్టళ్ల భద్రతపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!