Telangana Govt: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. బకాయిల సొమ్ము రూ.6 వేల కొట్లు విడుదల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ తన చిత్తశుద్ధిని చాటుకుంది. ఉద్యోగ జేఏసీ నాయకులకు ఇచ్చిన మాట ప్రకారం, తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ 100 రోజుల్లో మొత్తం రూ. 6,000 కోట్ల బకాయిలను పూర్తిగా విడుదల చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టమైన ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా గురువారం మరో రూ. 2,000 కోట్లను విడుదల చేశారు. ఈ బకాయిల చెల్లింపు ప్రక్రియను ప్రభుత్వం మూడు విడతల్లో పూర్తి చేసింది. మొదటి విడతగా గత మే 29న రూ. 2,000 కోట్లు, రెండో విడతగా జూన్ 30న రూ. 2,000 కోట్లు విడుదల చేయగా, తాజాగా మూడో విడతగా మరో రూ. 2,000 కోట్లను విడుదల చేసి ఉద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది.
ఈ నిధుల విడుదలతో విశ్రాంత ఉద్యోగులకు సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కమ్యూటేషన్ బకాయిలన్నీ పూర్తిగా చెల్లించబడ్డాయి. పదవీ విరమణ పొందిన సిబ్బంది సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, మిగిలిన ఇతర బకాయిలను కూడా రాబోయే రోజుల్లో ఇదే రీతిలో క్రమపద్ధతిలో క్లియర్ చేస్తామని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఆర్థిక ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి బకాయిలు చెల్లించడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగులు, విశ్రాంత సిబ్బంది తీవ్ర హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలకు ఉద్యోగ జేఏసీ నేతలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Also Read
- TSLPRB: తెలంగాణలో 7,437 పోలీస్ ఉద్యోగాలు.. ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ..
- గూర్ఖా రెజిమెంట్‌కు నివాళిగా కొత్త Royal Enfield Classic 350 Gorkha ఎడిషన్ విడుదల.. ధర, ఫీచర్లు ఇవే!
- Vijaysai Reddy: కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నా.. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తా!
- TTD Hundi Income: శ్రీవారికి కాసుల వర్షం.. హుండీ ఆదాయం సరికొత్త రికార్డు.. మూడేళ్ల తర్వాత..!
తాజావార్తలు
-
Anupama Parameswaran: పీరియడ్స్ విషయంలోనూ అవమానించాడు.. మాజీ ప్రియుడి వేధింపులపై అనుపమ సంచలన వ్యాఖ్యలు
-
Rapo 23 : విలన్ వేటలో రామ్.. ఫైనల్‌గా బాలీవుడ్ హీరో ఫిక్స్
-
TSLPRB: తెలంగాణలో 7,437 పోలీస్ ఉద్యోగాలు.. ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ..
-
గూర్ఖా రెజిమెంట్‌కు నివాళిగా కొత్త Royal Enfield Classic 350 Gorkha ఎడిషన్ విడుదల.. ధర, ఫీచర్లు ఇవే!
-
Kolkata Hotel Fire: హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. తొమ్మిది మంది మృతి
ట్రెండింగ్
-
Vijaysai Reddy: కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నా.. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తా!
-
India All-Time Test XI: భారత్ ఆల్‌టైమ్ బెస్ట్ టెస్టు ఎలెవన్.. కెప్టెన్‌గా కింగ్.. ధోనీ, జడేజాలకు షాక్!
-
9,100mAh బ్యాటరీ, 2K 144Hz డిస్ప్లే, Dimensity 9500Mతో iQOO Neo11 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
రిమూవబుల్ బ్యాటరీ, LTPO AMOLED డిస్ప్లే, ఐదేళ్ల వారంటీతో Fairphone Gen. 6+ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
10,000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, IP69 రేటింగ్‌తో iQOO Z11S వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే.!