BJP Leaders: నేడు రాష్ట్రానికి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. ఎవరెవరు అంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP Leaders: లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి రెండంకెల సీట్లు గెలుచుకోవాలనే లక్ష్యంతో కమలం పార్టీ రాష్ట్రంలో ప్రచారంలో దూసుకుపోతోంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ప్రధాని మోడీ, అమిత్ షా, జేపీ నడ్డాతో పాటు పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు రాష్ట్రంలో పర్యటించారు. పార్టీ అభ్యర్థుల తరపున సభలు, సమావేశాల్లో పాల్గొన్నారు. ఈరోజు మరోసారి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, తమిళనాడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.
Read also: SRH vs MI: నేడు ముంబైతో సన్రైజర్స్ ఢీ.. 300 స్కోర్పై కన్నేసిన ఎస్ఆర్హెచ్
Also Read
ఎక్కడ.. ఎప్పుడు..
నేడు పెద్దపల్లి లో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపి నడ్డా పర్యటించనున్నారు. పెద్దపల్లి పార్లమెంట్ గోదావరిఖనిలోని జూనియర్ కళాశాల మైదానంలో ఉదయం 11 గంటలకు భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఇక మధ్యాహ్నం 12.30 గంటలకు భువనగిరి పార్లమెంట్ చౌటుప్పల్ లో సభలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు నల్గొండలో బహిరంగ సభల్లో నడ్డా పాల్గొంటారు. ఇక బీజేపీ తమిళ్ నాడు అధ్యక్షులు అన్నామలై రానున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు జమ్మికుంట లో బహిరంగ సభలో పాల్గొననున్నారు. 3 గంటలకు కల్వకుర్తిలో బహిరంగ సభ నిర్వహించనున్నారు.
Read also: PM Modi AP Tour: నేడు ఏపీలో మోడీ ఎన్నికల ప్రచారం.. రాజమండ్రిలో ట్రాఫిక్ ఆంక్షలు
ఇక సాయంత్రం 6 గంటలకు సనత్ నగర్ నుండి పద్మారావు నగర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఇవాళ ఉదయం 11 గంటలకు ముషీరాబాద్ లో యువ సమ్మేళనంలో హాజరుకానున్నారు. మధ్నాహ్నం 12.30 గంటలకు నర్సంపేట లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. సాయంత్రం 5.30 కి మహబూబ్ నగర్ లోని బీజేపీ మేధావులతో సమావేశం నిర్వహించనున్నారు. మరోవైపు రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ సాయంత్రం రాష్ట్రానికి రానున్నారు. సికింద్రాబాద్ ఇంపిరియల్ గార్డెన్ లో ప్రవాసి సమ్మేళనంలో భజన్ లాల్ శర్మ పాల్గొననున్నారు.
Geethanjali Malli Vachindi : ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
తాజావార్తలు
-
Modi-Xi Jinping: ‘ఈజ్ ఇట్ ఓకే?’.. షీ జిన్‌పింగ్‌ను చూసి ప్రసంగం ఆపిన మోడీ.. అసలేం జరిగిందంటే?
-
Glaciers: వేడెక్కుతున్న భూమితో ఏం జరగబోతోంది?
-
BRICS Currency: బ్రిక్స్ కరెన్సీపై భారత్ కీలక ప్రకటన.. కామన్ కరెన్సీపై ఫుల్ క్లారిటీ..!
-
Khairatabad Bada Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ రెడీ.. ఈసారి పంచముఖ రూపంలో దర్శనం!
-
Kashi Majili OTT: ‘కాశీ మజిలీ’తో రీఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్.. ‘ఈటీవీ విన్’లో ఎమోషనల్ లవ్ స్టోరీ!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!