Muralidhar Rao: తెలంగాణ దేశంలో ఉందా? పాక్‌లోనా..? శివాజీకి జై అంటే నేరమా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్, ఎంఐఎం పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ ఇంఛార్జ్ మురళీధర్‌రావు.. బోధన్‌లో నెలకొన్ని పరిస్థితులు, బంద్.. తదితర అంశాలపై మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణ.. భారత దేశంలో ఉందా..? లేక పాకిస్థాన్‌లో ఉందా..? అని నిలదీశారు.. కేసీఆర్ తన మహారాష్ట్ర పర్యటనలో ఛత్రపతి శివాజీని పొగిడారు.. కానీ, నిన్న బోధన్‌లో శివాజీ విగ్రహం అంశంలో టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి హిందువులపై దాడి చేశాయని ఆరోపించారు.. ఇక, దాడులకు గురైనవారిపైనే కేసులు పెట్టారు అని విమర్శించిన ఆయన.. ఛత్రపతి శివాజీకి జై అంటే నేరమా? అని మండిపడ్డారు. హైదరాబాద్ నుండి ఆదిలాబాద్ వరకు ఇస్లాం కారిడార్, టెర్రర్ కారిడార్‌ని ఎంఐంఎ ఏర్పాటు చేస్తుందని సంచలన ఆరోపణలు చేసిన మురళీధర్‌రావు.. ప్రభుత్వం, పోలీసులు వారికి సహకరిస్తున్నారని ఫైర్ అయ్యారు.
Read also: Minister Botsa: పన్నులు కట్టకపోతే ఆస్తుల జప్తు.. ఇవాళ కొత్తగా వచ్చిందా..?
Also Read
- Cheyutha Pension : చేయూత పింఛన్‌కు రేపే డెడ్‌లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
- Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్‌కు హరీశ్ రావు లేఖ..!
- Aasara Pensions: ఆసరా పెన్షన్ల పెంపుపై శుభవార్త.. త్వరలో వారికి రూ.6 వేల పెన్షన్..
కేసీఆర్ అసెంబ్లీలో మూర్ఖంగా, అబద్దాలు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు మురళీధర్‌రావు.. హిందువుల గురించి మాట్లాడితే మతపిచ్చా..? అని ప్రశ్నించిన ఆయన.. బాధ్యత రహితంగా మాట్లాడితే ఖబడ్దార్ కేసీఆర్ అంటూ హెచ్చరించారు.. ముస్లిం మతోన్మాదానికి, ఉగ్రవాద కార్యకలాపాలకు కారణం కేసీఆర్, ఆయనే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.. ఇక, బెంగళూరుకి వచ్చినన్ని పెట్టుబడులు హైదరాబాద్‌కి ఎందుకు రాలేదు..? అని నిలదీశారు.. హిందువుల పలాయనం హైదరాబాద్‌లో నడుస్తోందన్న ఆయన.. పాత బస్తీలో హిందువుల సంఖ్య ఎందుకు తగ్గింది? అని ప్రశ్నించారు.. హైదరాబాద్ ఫైల్స్ తీసుకోస్తాం… వదిలి పెట్ట అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత.. రోహింగ్యాలకు ఆధార్, రేషన్ కార్డులు ఇవ్వడానికే తెలంగాణ హోం మంత్రి ఉన్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. మరోవైపు, కాశ్మీర్ ఫైల్స్‌పై రాహుల్ గాంధీ, కేసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదు? అని నిదీశారు మరళీధర్‌రావు.. కాశ్మీర్ ఫైల్స్ ని ప్రశ్నిస్తే మాడి మసై పోతారన్న ఆయన.. కాశ్మీర్ ఫైల్స్ కి హైదరాబాద్ కి సంబంధం ఉందన్నారు. కాశ్మీర్‌కి రక్షణ లేక పోతే తెలంగాణకు కూడా లేనట్లేనని పేర్కొన్నారు. ఇక, చరిత్రలో కేసీఆర్‌కి శిక్ష మాములుగా ఉండదంటూ హెచ్చరించారు మురళీధర్‌రావు.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!